ఒకరి నుంచి 9 మందికి : రెస్టారెంట్‌లో ఏసీ గాలి ద్వారా 3 ఫ్యామిలీలకు కరోనా సోకింది!

  • Published By: sreehari ,Published On : April 21, 2020 / 12:07 PM IST
ఒకరి నుంచి 9 మందికి : రెస్టారెంట్‌లో ఏసీ గాలి ద్వారా 3 ఫ్యామిలీలకు కరోనా సోకింది!

Updated On : April 21, 2020 / 12:07 PM IST

వేసవి కాలం.. ఉక్కపోస్తుందని ఏసీ వేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఏసీ గాలి కారణంగా కూడా కరోనా వ్యాపిస్తోంది. గదిలోని ఏసీల గాలితో కరోనా వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంది. రెస్టారెంటుకు వెళ్లిన మూడు కుటుంబాలకు కరోనా వైరస్ సోకింది.

ఆ రెస్టారెంటులో కరోనా సోకిన వ్యక్తి ద్వారా ఏసీ గాలిలో విస్తరించింది. అదే రెస్టారెంటులో ఉన్న ఈ మూడు ఫ్యామిలీ సభ్యులందరికి కరోనా సోకినట్టు ఓ నివేదిక వెల్లడించింది. గత జనవరిలో కరోనా వైరస్ ఉద్భవించిన వుహాన్ సిటీలో పూర్తిగా లాక్ డౌన్ ప్రకటించలేదు. అదే సమయంలో Guangzhou ప్రావిన్స్ లో ఉన్న ఓ రెస్టారెంటుకు ఒక ఫ్యామిలీ డిన్నర్ చేసేందుకు వెళ్లింది. 

అక్కడి డైనింగ్ టేబుళ్లపై కూర్చొని భోజనం చేశారు. ఈ కుటుంబం వుహాన్ సిటీ నుంచి రెస్టారెంటుకు వచ్చింది. వీరిలో ఒకరికి కరోనా వైరస్ ఉంది. ఆ విషయం వారికి కూడా తెలియదు. వారితో పాటు అదే రెస్టారెంటులో కూర్చొన మరో మూడు ఫ్యామిలీకి వైరస్ సోకింది. కొన్ని రోజుల తర్వాత తొమ్మిది మందిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడం ప్రారంభమయ్యాయి.

ఎయిర్ కండీషనర్ ద్వారా వైరస్ ట్రావెల్ అయి అక్కడి కుటుంబాలకు కూడా వ్యాపించింది. వీరిలో ఎవరూ కూడా వైరస్ వ్యాప్తి చేసిన వారిని కనీసం కలవలేదు.. వారితో మాట్లాడనూ లేదు. ఎలాంటి ఎటాచ్ మెంట్ లేదు. అయినప్పటికీ 9 మందికి కరోనా వైరస్ సోకింది. ఎలా సోకిందంటే.. ఎయిర్ కండీషర్ నుంచే గాలి ద్వారా వైరస్ వారందరికి వ్యాపించిందని తేలింది. కానీ, అదే రెస్టారెంటులో 73 మంది ఇతర డైనర్స్, రెస్టారెంట్ సిబ్బందికి వైరస్ సోకలేదు. 

చైనీస్ రెస్టారెంటులో జరిగిన ఆసక్తికరమైన ఈ కేసును చైనా సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కు చెందిన నిపుణులు గుర్తించినట్టు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. మూడు కుటుంబాలకు వైరస్ సోకడానికి ఫ్యామిలీ-A లో ఎవరికో ఒకరికి వైరస్ తప్పక ఉండి ఉంటుందనే నిర్ణయానికి నిపుణులు వచ్చారు. కరోనా వైరస్ ఉన్న వ్యక్తి కుటుంబాన్ని నిపుణులు ఫ్యామిలీ-Aగా పేరు పెట్టారు.

ఇతర రెండు కుటుంబాలను ఫ్యామిలీ-B, ఫ్యామిలీ-Cలుగా పేర్లు పెట్టారు. జనవరి 24న Guangzhouలో రెస్టారెంటులో ఈ ఫ్యామిలీ విందు చేసింది. మరుసటి రోజు తర్వాత వారిలో 63ఏళ్ల వృద్ధురాలికి దగ్గు మొదలైంది.. జ్వరం కూడా వచ్చింది. ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. 

అందిన రిపోర్టు ప్రకారం.. రెస్టారెంట్‌లో భోజనం చేసిన 9 మందిలో రెండు వారాల్లోగా అదే రోజున కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా సోకిన వృద్ధురాలితో పాటు ఆమె బంధువులు నలుగురు ఉన్నారు. రెస్టారెంటులో ఫ్యామిలీ-A కూర్చొన్న డైనింగ్ టేబుల్ కు ఎదురుగా ఇరువైపులా కూర్చొన్నారు.

వీరికి మాత్రమే కరోనా వైరస్ సోకింది. ఫ్యామిలీ-A ఎదురుగా ఒకే డైనింగ్ టేబుల్ దగ్గర సుమారు గంటపాటు స్టే చేయడంతో వారికి ఈ వైరస్ సోకి ఉండొచ్చునని నిపుణులు అంచనాకు వచ్చారు. దక్షిణ దిశగా ఉన్న ఎయిర్ కండీషనర్ నుంచి గాలి మూడు టేబుల్స్ మీదుగా ట్రావెల్ చేసి అది గోడను తాకి తిరిగి వెనక్కి వచ్చేలా ఉంది. 

జనవరిలో వుహాన్ అవతల కరోనా వైరస్ వ్యాప్తి చెందలేదు. వుహాన్ కు చెందిన ఫ్యామిలీ-A నుంచి కరోనా వైరస్.. ఇతర రెండు కుటుంబాలకు వ్యాపించింది. NYT రిపోర్టు ప్రకారం.. ఈ కేసుతో పాటు ఇలాంటి ఇతర కేసుల్లో డైనింగ్ నమూనాలు, తినేవారి విధానంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తి చెంది ఉండొచ్చునని నిపుణులు విశ్వసిస్తున్నారు.

వైరస్ బాధితుడు తుమ్మినా లేదా దగ్గినప్పుడు వారి నుంచి నీటి బిందువులు.. వైరస్ ఎయిర్ కండీషనింగ్ యూనిట్ ద్వారా ఇతరులకు వ్యాపించి ఉండొచ్చునని చైనీస్ పరిశోధకులు నిర్ధారించారు. రెస్టారెంటులో గాలి ట్రావెల్ చేసే డైరెక్షన్ వైరస్ వ్యాప్తికి కీలక వాహకంగా మారిందని అభిప్రాయపడ్డారు.