రెండవ ప్రపంచయుద్ధం నాటి బాంబు పేలడంతో చనిపోయిన సైనికులు

  • Published By: vamsi ,Published On : October 9, 2019 / 02:52 AM IST
రెండవ ప్రపంచయుద్ధం నాటి బాంబు పేలడంతో చనిపోయిన సైనికులు

Updated On : October 9, 2019 / 2:52 AM IST

రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో పెట్టిన బాంబు పేలడంతో యూరప్ లోని పోలాండ్ దేశంలో ఇద్దరు సైనికులు చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. పోలాండ్‌లో రెండవ ప్రపంచయుద్ధం సమయంలో పెట్టిన ఒక బాంబు ఇటీవల బయటపడింది.

ఆ బాంబును నిర్వీర్యం చేస్తున్న సమయంలో అది ఒక్కసారిగా పేలడంతో ఇద్దరు సైనికులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడగా అక్కడి రక్షణశాఖ మంత్రి మారియస్ బ్లాస్జాక్ ఈ విషయాన్ని వెల్లడించారు.

సైనికులు ఒక బాంబును నిర్వీర్యం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు చెప్పారు. బాంబు రెండవ ప్రపంచయుద్ధం నాటిదని తెలిపారు. కుజ్నియా రాసిబోర్స్కా పట్టణానికి సమీపంలో ఉన్న అడవిలో ఈ బాంబు పేలుడు సంభవించినట్లు సైన్యం వెల్లడించింది.

గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు. నాజీ జర్మనీ చేత ఆక్రమించబడిన పోలాండ్‌లో రెండవ ప్రపంచ యుద్ధం బాంబులు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి.