జైలులో కొడుకు..35 అడుగుల సొరంగం తవ్విన తల్లి..ఎక్కడో తెలుసా

  • Published By: madhu ,Published On : August 5, 2020 / 09:37 AM IST
జైలులో కొడుకు..35 అడుగుల సొరంగం తవ్విన తల్లి..ఎక్కడో తెలుసా

Updated On : August 5, 2020 / 11:36 AM IST

తన కొడుకు జైల్లో ఉండడం తట్టుకోలేకపోయిందా ఆ తల్లి. ఎలాగైనా బయటకు తీసుకరావాలని ప్రయ్నత్నించింది. ఏకంగా భారీ సొరంగాన్ని తవ్వేసింది. కొడుకును రక్షించే క్రమంలో పోలీసులకు చిక్కింది. కొడుకు కోసం చేసిన ఆ పనికి ఆ తల్లికి కోర్టు శిక్ష విధించింది. ఈ ఘటన ఉక్రేయిన్ లో చోటు చేసుకుంది.



జఫోరిజియా ప్రాంంతంలో ఓ నేరం చేసిన వ్యక్తికి జైలు శిక్ష విధించింది. దీంతో ఆ తల్లి ఎంతగానో బాధ పడింది. ఓ రోజు జైలుకు వెళ్లి కొడుకును కలిసింది. ఈ సందర్భంగా కొడుకు ప్లాన్ చెప్పాడు. మరుసటి రోజు…జైలుకు సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది.

పగలంతా ఇంట్లోనే ఉండింది. రాత్రి మాత్రం జైలుకు దగ్గరగా..నిర్మానుష్య ప్రాంతానికి చేరి..అక్కడ సొరంగం తవ్వడం ప్రారంభించింది. మూడు వారాల పాటు తవ్వి..35 అడుగుల సొరంగం తవ్వేసింది. కొడుకును తప్పించే క్రమంలో పోలీసులకు చిక్కి పోయింది. అనంతరం జరిపిన విచారణలో పై విషయాలు బయటపడ్డాయి. సొరంగం తవ్విన విధానాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.