Uber : వాటే టెక్నిక్ భయ్యా..! రైడ్స్ క్యాన్సిల్ చేసి ఏడాదిలో రూ.23 లక్షలు సంపాదించిన ఉబెర్ డ్రైవర్

లైఫ్ అంటేనే రిస్క్..రిస్క్ చేస్తేనే డబ్బు వస్తుంది. అదే టెక్నిక్ ను ఫాలో అయిన ఓ 70 ఏళ్ల క్యాబ్ డ్రైవర్ తనకు వచ్చిన రైట్స్ క్యాన్సిల్ చేసి కూడా భారీగా డబ్బు సంపాదించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు.

Uber : వాటే టెక్నిక్ భయ్యా..! రైడ్స్ క్యాన్సిల్ చేసి ఏడాదిలో రూ.23 లక్షలు సంపాదించిన ఉబెర్ డ్రైవర్

US Uber Driver Rides Cancelling technique

US Uber Driver Rides Cancelling technique : 70 ఏళ్ల ఉబెర్ డ్రైవర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. తన ప్రొఫెషనల్ లో ఓ చిన్న టెక్నిక్ ఉపయోగించి కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో  రూ.23 లక్షలు సంపాదించిన పెద్దాయన సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. తనకు వచ్చిన రైడ్స్ ను క్యాన్సిల్ చేసిన మరీ రూ.23 లక్షలు సంపాదించిన ఉబెర్ డ్రైవర్ గురించి తెలిస్తే ఇతర క్యాబ్ డ్రైవర్లు కూడా ‘ఈటెక్నిక్ తెలియక ఎంత టైమ్ వేస్ట్ చేశాం భయ్యా’అనేలా వైరల్ అవుతున్నాడు.

అమెరికాలోని నార్త్ కెరోలీనాకు చెందిన బిల్ అనే 70 ఏళ్ల వ్యక్తి ఉబెర్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అప్పటి వరకు ఏదో చిన్న ఉద్యోగం చేసిన రిటైర్ అయి తరువాత కూడా ఎంతోకంత సంపాదించాలనుకున్నాడు. ఆరేళ్ల క్రితం రిటైర్ అయిన అతను రైడ్- హెయిలింగ్ ప్లాట్ ఫారమ్ లో ఉబెర్ డ్రైవర్ గా మారాడు.రైడ్స్ కోసం తనకు వచ్చిన దాదాపు 30 శాతం రిక్వెస్టులను క్యాన్సిల్ చేసి గత ఏడాదిలో 28,000 డాలర్లు ..భారత్ కరెన్సీలో రూ.23 లక్షలు సంపాదించాడు. ఇతగాడి సూపర్ టెక్నిక్ అమెరికాలో చర్చనీయాంశంగా మారింది.

Pet Dog : చనిపోయిన యజమాని కోసం ఆహారం తినటం మానేసి ఎదురు చూస్తున్న కుక్క..

తన రైడ్స్ సమయాన్ని చాలా విలువైనదిగా భావించే అతను తన వ్యక్తిగత జీవితాన్ని కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవటానికి నిర్ణీత పనిగటలు పెట్టుకున్నాడు. వారానికి 40 గంటలు పని చేసిన రిటైర్ అయిన బిల్ ఇప్పుడు కేవలం 30గంటలే పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. డిమాండ్ ఉంటేనే తీసుకుంటాడు. లేదంటే క్యాన్సిల్ చేస్తాడు. అలా తనకు వచ్చిన రిక్వెస్టులను క్యాన్సిల్ చేసినా కూడా రూ.23లక్షలు సంపాదించి సోషల్ మీడియాలో వైరల్ అవ్వటమే కాదు అమెరికాలో చర్చనీయాంశంగా మారాడు.

దీని గురించి బిల్ మాట్లాడుతు…నాకు కస్టమర్ల నుంచి తనకు వచ్చిన చాలా వరకూ రిక్వస్టులను తిరస్కరిస్తా..కానీ డిమాండ్ ఎక్కువ ఉండే టైముల్లోనే తీసుకుంటానని తెలిపాడు. దీంతో..వారానికి 30 గంటలకు మించి ఉబెర్ నడపడంలేదని తెలిపాడు. ఇటీవల మా ఏరియాలో డిమాండ్ ఎక్కువగా ఉండే టైములు తగ్గిపోతున్నాయని..దీంతో తన రైడ్స్ కూడా తగ్గిపోతున్నాయని తెలిపాడు. డిమాండ్ ను బట్టి ఉదయం 10 నుంచి 2.30 వరకూ అందుబాటులో ఉంటా. ఆ సమయాల్లో తనకు నచ్చిన రైడ్స్ వస్తేనే ఎక్కించుకుంటాను… రానూపోనూ క్యాబ్ బుక్ చేసుకునే వారి రైడ్ రిక్వెస్టుల్నే తీసుకోవటానికి ఇష్టపడతానని..ఇదే నా టెక్నిక్ అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా..ఇలాంటి టెక్నిక్ ఉపయోగించే డ్రైవర్లను ఊబెర్ పక్కన పెట్టే్స్తుంది. అలా చేసేవారికి తక్కువ రైడ్లను కేటాయిస్తుంది. కానీ..ఈ పెద్దాయన మాత్రం తన వినూత్న టెక్నిక్ రిస్క్ తీసుకుని మరీ ఈ పెద్ద మొత్తాన్ని సంపాదించటం విశేషంగా మారింది.

Luck Signs : అదృష్టం వరించే ముందు కనిపించే సంకేతాలు .. వీటిని గుర్తిస్తే జీవితమే మారిపోతుంది..

గత కోవిడ్ సమయంలో చాలామంది డ్రైవర్లు అరోగ్య సమస్యల వల్ల వారు డ్రైవింగ్ నుంచి తప్పుకున్నారని కానీ.. తాను ఆ సమయంలో కూడా గంటకు 50 డాలర్ల వరకు సంపాదించానని తెలిపాడు.కోవిడ్ తగ్గిపోయాక తిరిగి అందరు పనిలో చేరారు. దీంతో డిమాండ్ తగ్గిపోయింది. ఇప్పుడు గంటకు 15 నుంచి 20 డాలర్లు మాత్రమే వస్తోందని తెలిపాడు. కానీ డబ్బు సంపాదించేందుకు కొన్ని టెక్నిక్స్ ఉపయోగిస్తానని నవ్వుతు చెప్పుకొచ్చాడు. దాంట్లో భాగంగా బిల్ వీకెండ్స్ లో డిమాండ్ ఉండటంతో ఆ రైడ్స్ కు వెళతాడు. శుక్ర, శనివారాల్లో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జాము 2.30 గంటల మధ్య డిమాండ్ టైమ్ లో రైడ్స్ కు వెళతాడు.

విమానాల్లో ప్రయాణాలు చేసేవారు ఆ సమయంలో క్యాబ్స్ బుక్ చేసుకుంటారు. దీంతో ఆ సమయాల్లో డిమాండ్ ఉంటుంది. కేవలం 20 నిమిషాల ప్రయాణానికే 10 నుంచి 20 డాటర్లు ఒక్కోసారి 40 నుంచి 50 డాలర్ల వరకు వస్తుంది. అదే 35 నిమిషాల ప్రయాణానికి 30 నుండి 60 డాలర్లు కూడా వచ్చే అవకాశాలున్నాయి.దీంతో ఆ సమయాలను ఉపయోగించుకుని తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడు.

కానీ.. ఇటువంటి టెక్నిక్ లు కాస్త రిస్కుతో కూడినవనే చెప్పాలి. ఉబర్ ప్రకారం..డ్రైవర్ ట్రిప్‌ను తిరస్కరించడం లేదా రద్దు చేస్తే..వారి ఖాతాకు యాక్సెస్‌ను కోల్పోయే అవకాశం ఉంది. బిల్ కూడా అటువంటి పరిస్థితిని ఫేస్ చేశాడు. అయినా తన టెక్నిక్ నే ఫాలో అవుతున్నాడు.రిస్కులోనే డబ్బుంటుంది అంటాడు నవ్వుతు..