ఇంటర్నెట్ స్లోగా ఉందని పేపర్‌లో యాడ్ ఇచ్చిన 90ఏళ్ల వ్యక్తి.. ఏకంగా 10వేల డాలర్లు ఖర్చుపెట్టాడు!

Newspaper Ads To Complain Slow Internet Speed : ఇంటర్నెట్ స్లోగా ఉంటే ఎవరికైనా చిరాకు రావడం కామన్. ఇలాంటి అనుభవమే 90ఏళ్ల వ్యక్తికి ఎదురైంది. ఇంటర్నెట్ నెమ్మదిగా ఉందంటూ న్యూస్ పేపర్‌లో యాడ్ ద్వారా కంప్లయింట్ చేశాడు. ఇందుకోసం ఏకంగా రూ.10వేల డాలర్లు ఖర్చు పెట్టాడు.
యూనైటెడ్ స్టేట్స్ లోని కాలిఫోర్నియాలో అరోన్ ఎప్ స్టెయిన్ అనే 90ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇంటర్నెట్ స్లోగా ఉందంటూ వాల్ స్ట్రీట్ జనరల్ కు చెందిన న్యూయార్క్ ఎడిషిన్‌లో అడ్వర్టైజ్ మెంట్ ద్వారా కంప్లయింట్ చేశాడు.
అలాగే ఇంటర్నెట్ ప్రొవైడర్ కూడా నోటీసులు పంపాడు. ఏటీ అండ్ టీ నెట్ వర్క్ ను 80ఏళ్లకు పైగా వినియోగించుకుంటున్నాడు ఎప్ స్టెయిన్. ఇంటర్నెట్ స్పీడ్ స్లోగా ఉందంటూ ఎన్నోసార్లు నెట్ వర్క్ కస్టమర్ కేర్ కు కంప్లయింట్ చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో పేపర్ ద్వారా యాడ్ లో ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు.
దాంతో స్పందించిన ఏటీ అండ్ టీ నెట్ వర్క్ యాజమాన్యం వెంటనే ఫిర్యాదుదారుడికి ఫోన్ కాల్ చేసి వివరణ ఇచ్చింది. ఎప్ స్టెయిన్ ఉండే ఏరియాలో ఫైబర్ కనెక్టివిటీని అప్ గ్రేడ్ చేసింది.