భూమి వేగం పెరిగింది.. గంటలు తగ్గిపోతున్నాయి.. ఇప్పుడిక రోజుకు 24 గంటలు కాదు.. ఎందుకో తెలుసా?

భూమి వేగం పెరిగింది.. గంటలు తగ్గిపోతున్నాయి.. ఇప్పుడిక రోజుకు 24 గంటలు కాదు.. ఎందుకో తెలుసా?

Updated On : January 10, 2021 / 12:30 PM IST

A day on Earth is now shorter than 24 hours : మన భూమి వేగం పెరిగిందంట.. అందుకే రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. చూస్తుండంగానే టైం అయిపోతుందని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడిక రోజుకు 24 గంటలు కాదంట.. అంతకంటే తక్కువ అంటున్నారు ఖగోళ సైంటిస్టులు.

2021లో సగటున రోజుకు 0.05 మిల్లీ సెకన్లు సమయం తగ్గిపోయింది. 2020 ఏడాదంతా 28 రోజులు తొందరగా గడిచిపోయాయంట. సమయం వేగంగా గడిచిపోతోంది. 1960 నుంచి 50ఏళ్లలో ఇదే రికార్డు అంటున్నారు సైంటిస్టులు. గతంలో భూమి వేగం తగ్గితే 28 సార్లు ఒక లీప్​ సెకన్​ను కలిపారు. ఇప్పుడు ఆ ఒక లీప్​ సెకన్​ను టైం నుంచి తొలగించాలని భావిస్తున్నారు.
Earth is now shorter than 24 hours తక్కువ టైంలో భూమి వేగంగా చుట్టేస్తోంది. సాధారణంగా భూమి తన చుట్టూ తాను తిరిగొస్తే ఒకరోజు గడిచినట్టు కదా.. అంటే 24 గంటలు.. 86,400 సెకన్లు అనమాట.

2021లో 24 గంటల కంటే అంతకంటే తక్కువ సమయంలోనే భూమి తాను చుట్టూ తాను తిరిగేస్తుందంట. అంటే.. ఒక రోజులో సగటున అర క్షణం టైం తగ్గిపోయినట్టే. మొత్తంగా ఏడాదికి లెక్కిస్తే… 19 మిల్లీ సెకన్లుగా చెప్పవచ్చు.
అందుకేనంట.. 2021లో ఒక లీప్ సెకనును టైం నుంచి తీసేయాలని సైంటిస్టులు తెగ చర్చిస్తున్నారంట. వాతావరణ పీడనం, గాలి ప్రభావం, మహాసముద్రాల మట్టం స్థాయిలు, భూకేంద్రకం కదలికల వల్ల భూమి వేగంలో హెచ్చుతగ్గులు వస్తాయని చెబుతున్నారు.

2020లో జులై 19న రోజు తొందరగా గడిచిపోయింది. రికార్డ్​ స్థాయిలో 1.4602 మిల్లీ సెకన్ల టైం రోజులో తక్కువైంది. ఇది 24 గంటల కంటే చాలా తక్కువ. 2020 కంటే ముందుగా 2005లో 28 రోజులు చాలా వేగంగా గడిచిపోయాయి. గత 12 నెలలో ఇప్పుడు ఆ రికార్డ్​ ను 2020 బ్రేక్ చేసింది.
భూమి వేగం పెరిగినట్టు ఎలా తెలుస్తుంది? :
ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రిఫరెన్స్ సిస్టమ్స్ సర్వీసు (IERS) ఒక రోజులో భూమి వేగాన్ని అధికారికంగా లెక్కిస్తుంటుంది. ఒక రోజుకు ఎన్ని గంటలో సమయాన్ని లెక్కిస్తుంది. ఆకాశంలో ఫిక్స్ చేసిన ఓ స్టార్ నిర్దిష్ట ప్రాంతం నుంచి రోజుకు ఎంతో సమయాన్ని లెక్కిస్తుంటుంది.

సోలర్ టైం ప్రకారం.. యూనివర్శల్ టైం (UTI)గా సూచిస్తారు. అంతర్జాతీయ ఆటోమిక్ టైమ్ (TAI)తో ఈ UTI పోలిస్తే.. భూమి వేగం టైం స్కేల్ తెలుసుకోవచ్చు. ప్రపంచమంతా ల్యాబరేటరీల్లో అమర్చిన ఇలాంటి 200 ఆటోమిక్ క్లాకులతో లెక్కిస్తారు. 24 గంటల్లో TAI నుంచి ఒక రోజులో సమయాన్ని లెక్కించడం జరుగుతుంది.

నెగటివ్ లీప్ అంటే :
నివేదికల ప్రకారం.. భూ భ్రమణం అణు గడియారాల super-steady beatతో సింకరైజ్ కావాలి. అలా కానప్పుడు పాజిటివ్ లేదా నెగటీవ్ లీపు సెకను ఉపయోగించవచ్చు. ఇప్పుడు అదే నెగటివ్ లీప్ సెకండ్‌ను చేర్చేవిధంగా సైంటిస్టులను ప్రేరేపించింది. ఈ మార్పు కోసం ఎప్పటికప్పుడు ఒక సెకను తీయాల్సిన అవసరం ఉందా అనే చర్చకు దారితీసింది.

లీప్ సెకండ్ అంటే :
లీప్ సెకన్లు లీప్ ఇయర్స్ మాదిరిగానే సమయం సర్దుబాటును సూచిస్తాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ ( NIST) ప్రకారం.. ఖగోళ సమయంతో సింకరైజ్ చేయడానికి సాయపడుతుంది. గడిచే సమయపు కాలాన్ని కో ఆర్డినేటెడ్​ యూనివర్సల్​ టైం (UTC)లో మార్పులకు తగ్గట్టుగా మారుస్తారు. 24 గంటల టైంలో ఒక క్షణ కాలాన్ని సర్దుబాటు చేయడాన్నే లీప్​ సెకన్​ అంటారు.

ఆటమిక్​ గడియారాలతో నిర్ణయించే కచ్చితమైన సమయం, కచ్చితత్వంలేని సౌర సమయానికి మధ్య తేడాలొస్తుంటాయి. ఈ గ్యాప్​ను పూడ్చేలా దాన్ని సర్తుపాటు చేస్తుంటారు. అలా చేయాల్సి వస్తే.. 6 నెలల ముందే నిర్ణయం తీసుకుంటారు. ఈ లీప్​ సెకన్​ వ్యవహారాన్ని ఫ్రాన్స్​ లోని ఇంటర్నేషనల్​ ఎర్త్​ రొటేషన్​ అండ్​ రిఫరెన్స్​ సిస్టమ్​ సర్వీస్​ (IERS​) చూస్తూ ఉంటుంది. జూన్​ లేదా డిసెంబర్​లోనే లీప్​ సెకన్​ను సర్దుబాటు చేయడం జరుగుతుంది.

లాభాలు.. నష్టాలేంటి? :
లీప్​ సెకన్​ వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువనే వాదన లేకపోలేదు. కొన్ని డేటా లాగింగ్ అప్లికేషన్లు, టెలికమ్యూనికేషన్స్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ వంటి పలు సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలపై ప్రభావం పడుతుందని అంటున్నారు. లీప్ సెకన్లపై చాలామంది వ్యతిరికత లేకపోలేదు. అందుకే యూటీసీకి తగినట్టుగా టైంను సర్దుబాటు చేస్తుంటారు. భూమి వేగం మరింత పెరిగితే కచ్చితంగా ఓ లీప్​ సెకన్​‌ను తీసేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు టెలికమ్యూనికేషన్ల సమయాన్ని యూటీసీకి తగినట్టుగా సర్దుబాటు చేయడం జరగుతుంది.