UK Approved Moderna Vaccine : కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌కు కూడా వ్యాక్సిన్..మోడెర్నా టీకాకు యూకే అనుమతి

ఇప్పటి వరకు కరోనా వైరస్‌కు మాత్రమే టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ను ఎదిరించే టీకా కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ వేరియంట్‌ పనిపట్టేలా మోడెర్నా అధునాతన టీకా వినియోగానికి యూకే అనుమతులు మంజూరు చేసింది.

UK Approved Moderna Vaccine : కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌కు కూడా వ్యాక్సిన్..మోడెర్నా టీకాకు యూకే అనుమతి

UK Approved Moderna Vaccine

Updated On : August 16, 2022 / 10:00 AM IST

UK Approved Moderna Vaccine : ఇప్పటి వరకు కరోనా వైరస్‌కు మాత్రమే టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ను ఎదిరించే టీకా కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ వేరియంట్‌ పనిపట్టేలా మోడెర్నా అధునాతన టీకా వినియోగానికి యూకే అనుమతులు మంజూరు చేసింది.

ఫలితంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌పై పనిచేసే టీకాకు అనుమతులిచ్చిన తొలి దేశంగా యూకే రికార్డులకెక్కింది. పెద్దల కోసం బూస్టర్‌ డోస్‌గా దీనిని వినియోగించేందుకు యూకే మెడిసిన్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ అనుమతులు మంజూరు చేసింది.

4th Covid Shot : ఫోర్త్ డోస్ అవసరమవచ్చు..మోడెర్నా సీఈవో కీలక వ్యాఖ్యలు

ఇది కరోనా ఒరిజినల్ వైరస్, ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా బలమైన రోగనిరోధకశక్తి ప్రతిస్పందనను కనబరిచినట్టు తెలిపింది. అలాగే ప్రస్తుతం ఆధిపత్యం చూపిస్తున్న ఒమిక్రాన్ బీఎ.4, బీఏ.5లపైనా మంచి ప్రభావం చూపిస్తున్నట్టు వివరించింది.