Abortion Leaves : మహిళలకు వేతనంతో కూడిన గర్భస్రావ సెలవులు..

మహిళలకు వేతనంతో కూడిన గర్భస్రావ సెలవులు ప్రకటించిందో సంస్థ.అంతేకాదు కుటుంబ సభ్యులకు అనారోగ్యంపాలైనా..సెలవులు ఇస్తోంది. అలాగే బంధువులు చనిపోయినా వేతనంతో కూడిన సెలవులు ఇస్తోంది.

Abortion Leaves : మహిళలకు వేతనంతో కూడిన గర్భస్రావ సెలవులు..

Abortion Leaves

Updated On : December 10, 2021 / 11:37 AM IST

Abortion leaves : మహిళలకు అనేక కారణాల వల్ల గర్భస్రావాలు జరుగుతుంటాయి.  ఆ ఇబ్బంది నుంచి వారు మానసికంగా..శారీరకంగా కోలుకోవటానికి కొంత సమయం పడుతుంది. అదే ఉద్యోగినుల అయితే ఆ ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉంటాయి. తగిన సెలవులు లభించకపోవచ్చు వారు వారు పనిచేసే ఆఫీసుల నుంచి. అటువంటి క్లిష్ట పరిస్థితులను ఓ సంస్థ అర్థం చేసుకుంది. తమ ఉద్యోగులకు గర్భస్రావ సెలవులు ప్రకటించింది. అదికూడా ఇరవై రోజులపాటు వేతనంతో కూడిన సెలవుల్ని ప్రకటించింది అంతర్జాతీయ బ్యాంకింగ్‌ సంస్థ గోల్డ్‌మ్యాన్‌ స్యాక్స్‌.

Read more : కండిషన్స్ అప్లై : నాన్నకు ఏడాది సెలవులు

అంతేకాదు ఈ సంస్థ సరోగసి ద్వారా గర్భం ధరించేవారికి కూడా ఈ సెలవు ఇస్తోంది.మహిళల విషయంలో పెద్ద మనస్సుతో ఈ సంస్థ తీసుకునే నిర్ణయాలు ఆహ్వానించదగినవి. అంతేకాదు…తమ ఉద్యోగుల కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఇరవై రోజులు సెలవుల్ని ఇస్తోంది. అదే ఉద్యోగి దగ్గరి బంధువు చనిపోతే అయిదు రోజులు..కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలైతే నాలుగు వారాలపాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తోంది అంతర్జాతీయ బ్యాంకింగ్‌ సంస్థ గోల్డ్‌మ్యాన్‌ స్యాక్స్‌. తమ ఉద్యోగుల విషయంలో ఈ సంస్థ తీసుకునే ఇటువంటి నిర్ణయాలు ఆ సంస్థ ఉద్యోగులకే కాదు..మానవత్వంతో కూడిన సామాజిక బాధ్యత అని కూడా అనుకోవచ్చు..

Read more : Pakistan PM Imrankhan: కశ్మీర్‌పై పాక్ ప్రధాని ఇమ్రాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

గర్భస్రావం. అమ్మ కడుపులో రూపుదిద్దుకున్న బిడ్డ ఈ లోకాన్నిచూడకుండానే చనిపోవటం. లేదా రూపుదిద్దుకునే సమయంలోనే ఆ పిండం ప్రాణాలు తీసేయటం. కొన్ని సార్లు అనేక కారణాల వల్ల మహిళలు గర్భస్రావం చేయించుకుంటారు. దానికి కారణాలు ఎన్నో ఉంటాయి. పిండం ఎదుగుదలలో లోపాలుంటే ఆ బిడ్డ పుట్టి పెరిగటానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.అది బిడ్డకే కాదు ఆ తల్లిదండ్రులకు కూడా చాలా చాలా ఇబ్బంది. గర్భస్రావం చేయించుకోవాలంటే చాలా బలమైన కారణాలు ఉండాలి.

Read more : Mexico : ఘోర ప్రమాదం 49 మంది మృతి.. 40 మందికి గాయాలు

గర్భస్రావం చేయించుకున్నాక సదరు మహిళ కోలుకోవటానికి కూడా సమయంలో పడుతుంది.అది మానసికంగాను..శారీరకంగాను. అటువంటి గర్భస్రావం చేయించుకోవాలంటే సదరు మహిళ మానసికంగా..శారీరకంగా కూడా సిద్ధమై ఉండాల్సి ఉంటుంది. అలా సదరు మహిళ స్థితిని అర్థం చేసుకున్న గోల్డ్‌మ్యాన్‌ స్యాక్స్ ని ప్రశంసించాల్సిందే..