Afghanistan Bus Accident: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బంగారం వెలికి తీసేందుకు వెళ్తూ 17మంది మృతి ..
చాహ్ అబ్ జిల్లా గవర్నర్ ముల్లా జమానుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో మరణించిన వారంతా బంగారు గని కార్మికులే. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు.

Road Accident
Afghanistan Bus Accident: ఆఫ్ఘనిస్థాన్‌లోని తఖర్ ప్రావిన్స్‌లో బస్సు బోల్తా పడటంతో 17 మంది మరణించారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. చాహ్ అబ్ జిల్లా నుంచి అంజీర్ ప్రాంతంలోని బంగారం గనిలో పనిచేసేందుకు కార్మికులు బస్సులో వెళ్తున్నారు. చాహ్ అబ్ సెంటర్, గనుల మధ్య బస్సు రోడ్డు మళ్లడంతో బోల్తా పడింది.
Pakistan Bus Accident: బ్రేకులు ఫెయిల్.. కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు.. 12 మంది మృతి
తాలిబాన్ చాహ్ అబ్ జిల్లా గవర్నర్ ముల్లా జమానుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో మరణించిన వారంతా బంగారు గని కార్మికులే. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు. వీరికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఆప్ఘనిస్థాన్ లో ప్రతీయేటా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. రహదారులు సరిగా లేకపోవటంతో, రాకపోకలు సాగించేందుకు వీలుకాని రహదారులపై నిత్యం వాహన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు.
Bus Accident: లోయలో పడిన వలసదారులతో వెళ్తున్న బస్సు.. 39మంది మృతి
తాజాగా జరిగి బస్సు బోల్తా ప్రమాదంలో సైతం 17 మంది మరణించడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 రోడ్డు ట్రాఫిక్ ప్రమాద నివేదిక ప్రకారం.. ఆ ఏడాది ఆప్ఘనిస్థాన్‌లో 6,033 మంది మరణిస్తున్నట్లు తెలిపింది. ప్రపంచంలో ప్రమాద మరణాల పరంగా ఆప్ఘనిస్థాన్ 76వ స్థానంలో ఉంది. ప్రతీయేటా రోడ్డు ప్రమాదాల కారణంగా వందల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు.