Bus Accident: లోయలో పడిన వలసదారులతో వెళ్తున్న బస్సు.. 39మంది మృతి

అమెరికాలోని పశ్చిమ పనామాలో వలసదారుతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి కొండపై నుంచి లోయలోపడింది. ఈ ప్రమాదంలో 39మంది దుర్మరణం చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Bus Accident: లోయలో పడిన వలసదారులతో వెళ్తున్న బస్సు.. 39మంది మృతి

BUS Accident

Bus Accident: 66 మంది వలసదారులతో ప్రయాణిస్తున్న బస్సు కొండపై నుంచి పడింది. ఈ ప్రమాదంలో 39 మందికి ప్రాణాలు కోల్పోగా, 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాలోని పశ్చిమ పనామాలో వలసదారులతో వెళ్తున్న క్రమంలో ఈ విషాద ఘటన జరిగింది. కొలంబియా నుంచి డేరియన్‌లైన్‌ను దాటి పనామాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని గౌలాకా శరణార్థుల శిభిరానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

Crime News: ధాబాలోని ఫ్రీజర్ లో యువతి మృతదేహం లభ్యం.. ఆమెను ప్రేమించిన వ్యక్తి అరెస్ట్

ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు పనామా అధ్యక్షుడు లారెన్షియో కార్టిజో ట్విటర్‌లో తెలిపారు. వలసదారుల బస్సు షెల్టర్‌నుదాటి వెళ్లడంతో దానిని మళ్లీ హైవేపైకి తీసుకురావడానికి డ్రైవర్ ప్రయత్నించాడని, ఈ క్రమంలో అటుగా వస్తున్న మరో బస్సు దానిని ఢీకొనడంతో బస్సు లోయలో పడినట్లు లారెన్షియో కార్టిజో తెలిపారు. గత పదేళ్లలో పనామాలో వలసదారులు చూసిన ఘోర ప్రమాదం ఇదేనని స్థానిక అధికారులు తెలిపారు.

 

బస్సులో 66 మంది ప్రయాణిస్తున్నారని, గాయపడిన వారిలో ఐదు కంటే ఎక్కువ మంది చిన్నారులు ఉన్నట్లు పనామా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత సంవత్సరం దాదాపు 2.50లక్షల మంది వలసదారులు డారియన్ అడవిని దాటారు. ఎక్కువ మంది వెనిజులాన్లు. ఈ ఏడాది జనవరిలో 24వేల మంది వలసదారులు డారియన్ ను దాటారు. అయితే వీరిలో ఎక్కువగా హైటియన్లు, ఈక్వెడారియన్లు ఉన్నట్లు పనామా అధికారులు తెలిపారు.