Iran Israel Conflict: ఇరాన్ పై కౌంటర్ అటాక్ కు సిద్ధమైన అమెరికా..! సౌదీ నుంచి బయలుదేరిన జెట్స్..!
మిడిల్ ఈస్ట్ లోని అమెరికా మిలటరీ స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసింది.

Iran Israel Conflict: ఇరాన్ ప్రతీకార దాడులతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలర్ట్ అయ్యారు. మిడిల్ ఈస్ట్ లోని అమెరికా మిలటరీ స్థావరాలపై ఇరాన్ దాడులు ప్రారంభించడంతో ట్రంప్ రంగంలోకి దిగారు. వైట్ హౌస్ లోని సిచుయేషన్ రూమ్ కి వెళ్లారు ట్రంప్. ఇరాన్ దాడులు, మిడిల్ ఈస్ట్ లో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆయన సమీక్షిస్తున్నారు. ఇరాన్ దాడులను ట్రంప్ సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. ఇరాన్ పై కౌంటర్ అటాక్ కు అమెరికా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమెరికా జెట్స్ సౌదీ అరేబియా నుంచి బయలుదేరినట్లు సమాచారం.
ఇజ్రాయెల్ తో యుద్ధంలో తలదూర్చడమే కాకుండా తమ దేశంలోని అణు స్థావరాలపై దాడి చేసిన అమెరికాపై ప్రతీకార దాడులకు దిగింది ఇరాన్. మిడిల్ ఈస్ట్ లోని అమెరికా మిలటరీ స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసింది. 4 దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. ఖతార్ తో పాటు ఇరాక్, బహ్రెయిన్, కువైట్ లోని అమెరికా మిలటరీ బేస్ లపై ఇరాన్ దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఖతార్ రాజధాని దోహాలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ముందు జాగ్రత్తగా ఖతార్, యూఏఈ తమ గగనతలాలను మూసివేశాయి. ఈ ఆపరేషన్ కు బషారత్ అల్-ఫాత్ (విజయ ప్రకటన లేదా ఆపరేషన్ శుభవార్త అంటారు) అనే పేరు పెట్టింది ఇరాన్.
తమ దేశంలోని ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ మూడు అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. ఖతార్ రాజధాని దోహాలోని యూఎస్ కు చెందిన అతిపెద్ద వైమానిక స్థావరంపై మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఆరు మిస్సైళ్లతో అటాక్ చేసింది. ఖతార్ తన గగనతలాన్ని మూసివేసినట్లు ప్రకటించిన కాసేపటికే ఈ దాడులకు పాల్పడింది ఇరాన్. అల్ ఉదీద్ ఎయిర్ బేస్.. మిడిల్ ఈస్ట్ లో అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం ఇదే.
Also Read: అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులు.. సైనిక స్థావరాలపై మిస్సైళ్లతో అటాక్..