యజమానికి రెండు తలల పాముని గిఫ్టుగా ఇచ్చిన పిల్లి

America : palm harbor home rare two headed snake : రెండు తలలతో బర్రెలు, గొర్రెలు, మేకలు, పాములు పుడుతుంటాయి. వీటిలో రెండు తలల పాములు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అలా యూఎస్ లో ఓ రెండు తలలు పాము కనిపించింది. ఆ పామే ఓ విశేషమైతే..ఓ పిల్లి దాన్ని పట్టుకొచ్చి తన యజమానికి గిప్టుగా ఇవ్వడం మరో విశేషం.
వివరాల్లోకి వెళితే..ఫ్లోరిడా రాష్ట్రంలోని పామ్ మార్బర్‌లో నివసిస్తున్న కే రోజెర్స్ ఓ పిల్లిని పెంచుకుంటోంది. క్యూట్ గా ఉండే ఆ పిల్లి పేరు ‘ఆలివ్’. ఆలివ్‌కు ఇంట్లో ఉండటం కంటే బయట షికార్లు తిరగడమంటే భలే సరదా. అలా ఓ రోజున ఆలివ్ బైటకు షికారెల్లింది. అలా పెత్తనాలు చేసుకుంటూ వస్తుంటే దానికి ఓ చెత్తలో బారెడు పొడవున్న రెండు తలల పామును కనిపించింది. దాన్ని చూసిన ఆలివ్ దాన్ని నోటకరచుకుని జాగ్రత్తగా తీసుకొచ్చి ..నేరుగా లివింగ్ రూంలోకి తీసుకొచ్చి కార్పెట్‌పైన పెట్టింది. తన చిన్న యజమానిని తీసుకొచ్చి ‘‘నీకో గిఫ్టు తీసుకొచ్చానన్నట్లుగా’’ ఆ పాముని చూపించింది.
https://10tv.in/rare-white-sea-turtle-found-on-south-carolina-beach/
ఆలివ్ యజమాని రోజెర్స్ కూతురు ఆ పామును చూసి భయపడిపోయింది. తర్వాత వింతగా ఉందని ఎక్కడికీ పారిపోకుండా దాన్ని ఓ బాక్సులో పెట్టి బంధించింది. దానికి డోస్ అనే పేరు కూడా పెట్టి ఆ బాక్సు పక్కన కూర్చుని ఆడుకుంటోంది. ఆ బాక్సులోని పాముని చూసి పాముతో ఆడుకుంటున్న కూతుర్ని చూసి రోజెర్స్ భయపడింది. వెంటనే అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేసి చెప్పింది. వాళ్లొచ్చి ఆ రెండు తలల వింత పామును పట్టుకెళ్లిపోయారు.
పామును పట్టుకెళ్లిపోవటంతో ఆ పాప ఏడ్చింది. కానీ పాములు ప్రమాదకరమైనవనీ..అటువంటి వాటితో ఆడుకోకూడదని తల్లి నచ్చ చెప్పి అటువంటి రెండు తలల పాముని కొచ్చింది. ఇక ఆ పాముని మరచిపోయిన ఆ పాపం బొమ్మపాముతో ఆడుకుంటోంది.
జన్యులోపం వల్ల ఇలాంటివి పుడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. రెండు తలల్లో రెండు మెదళ్లు ఉండడం వల్ల వాటి మానసిక స్థితి సరిగ్గా ఉండదు. ఒక మెదడు నుంచి ఒక సంకేతం, మరో మెదడు నుంచి మరో సంకేతం వస్తుంది. దీంతో అవి గందరగోళానికి గురవుతాయి… ఆహరం తీసుకోవడంలోనూ ఇబ్బందులు పడతాయి. శత్రువులకు కూడా చాలా సులభంగా దొరికిపోతాయ ’ అని తెలిపారు. ప్రస్తుతం ఆ రెండు తలల పాముని జూలో ఉంచి కాపాడుతున్నారు.