Britain Covid : రోజుకు 3లక్షల కరోనా కేసులు.. మళ్లీ కొవిడ్ సునామీ.. బ్రిటన్‌ను బెంబేలెత్తిస్తున్న మహమ్మారి

ఆ దేశంలో కరోనా కేసులు సునామీని తలపిస్తున్నాయి. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నట్లు అంచనా. రోజుకు సగటున 3లక్షల కేసులు రికార్డు అవుతున్నాయని, ఫిఫ్త్ వేవ్ మొదలైపోయినట్లు..

Britain Covid : రోజుకు 3లక్షల కరోనా కేసులు.. మళ్లీ కొవిడ్ సునామీ.. బ్రిటన్‌ను బెంబేలెత్తిస్తున్న మహమ్మారి

Britain Covid

Britain Covid : కరోనా హాంఫట్ అనుకున్నారు. కొవిడ్ మళ్లీ రాదులే అని రిలాక్స్ అయ్యారు. మాస్కులు తీసేసి తిరిగారు. వ్యాక్సిన్ వేసుకున్నాంలే.. కరోనా ఇంకేం చేయగలదు అని నిర్లక్ష్యం చేశారు. తీరా ఏం జరిగింది. కరోనావైరస్ మహమ్మారి మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. అది కూడా మాములు ఎంట్రీ కాదు. దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయే ఎంట్రీ. ఇదెంత మరెక్కడో కాదు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కరోనా హాట్ స్పాట్ కంట్రీస్ లో ఒకటైన బ్రిటన్ లో. అవును.. బ్రిటన్ లో మళ్లీ మహమ్మారి విజృంభిస్తోంది. ఆ దేశంలో కరోనా కేసులు సునామీని తలపిస్తున్నాయి. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నట్లు అంచనా. అధికారికంగా ప్రభుత్వం నుంచి రోజువారి కేసుల సంఖ్య అయితే రిలీజ్ అవడం లేదు కానీ, రోజుకు మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు టిమ్ అనే ప్రొఫెసర్ చేసిన ట్వీట్ తో యూకే ఒక్కసారిగా షేక్ అయ్యింది.

రోజుకు సగటున మూడు లక్షల కరోనా పాజిటివ్ కేసులు రికార్డు అవుతున్నాయని, బ్రిటన్ లో ఫిఫ్త్ వేవ్ మొదలైపోయినట్లు ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. ఆసుపత్రిలో చేరికల సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. మరోవైపు బ్రిటన్ ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాట్స్ విడుదల చేసిన గణాంకాల్లో కూడా దాదాపుగా ఇదే రకమైన పెరుగుదల కనిపిస్తోంది.

Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!

ఇంగ్లండ్ లో ప్రతీ 30 మందిలో ఒకరు కరోనా బారిన పడుతున్నారంటూ బ్రిటన్ ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాట్స్ గణాంకాలు చెబుతున్నాయి. ఐర్లాండ్ లో ప్రతీ 25 మందిలో ఒకరు, స్కాట్లాండ్ లో ప్రతీ 18మందిలో ఒకరు కొవిడ్ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ బీఏ4, బీఏ5లతో కేసులు పెరుగుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

కరోనా లక్షణాలు ఏమాత్రం లేని వారు కూడా వైరస్ బారిన పడుతుంటడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న వారిని కూడా ఒమిక్రాన్ వదిలిపెట్టడం లేదు. సాధారణంగా వైరస్ ఒకసారి సోకి కోలుకున్న తర్వాత కనీసం మూడు నెలలకు కానీ మరోసారి ఇన్ ఫెక్షన్ రాదు. అయితే, బీఏ4, బీఏ5 మాత్రం గ్యాప్ లేకుండా వ్యాపించేస్తున్నాయట.

Dangerous bacteria: హిమాలయాల మంచు కింద వందలాది డేంజరస్ బ్యాక్టీరియాలు..అవి బయటపడితే..కరోనాను మించిన కల్లోలమే..

ఇక ఒక జూన్ లోనే 23లక్షల మంది కరోనా బారిన పడినట్లు నేషనల్ స్టాట్స్ ఆఫీస్ చెబుతోంది. గతవారంలో 5లక్షల మందికిపైగా కరోనా సోకినట్లు సమాచారం. అటు ఆసుపత్రిలో చేరికలు కూడా పెరుగుతూ ఉండటం మరింత కలవరపెడుతోంది. గత జూన్ 27 నాటికి దాదాపు 10వేల మంది కరోనా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇది 18 నెలల గరిష్టం. గతేడాది ఆరంభంలో ఒక్క నెలలో 20వేల మందికిపైగా కరోనా సోకి ఆసుపత్రుల పాలయ్యారు. మళ్లీ అదే రేంజ్ లో ఆసుపత్రుల్లో చేరికలు నమోదవుతుండటంతో పాత రోజులు తప్పవేమో అన్న భయాలు నెలకొన్నాయి.