UK-India NSA meeting: యూకే-భార‌త్ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుల స‌మావేశంలో పాల్గొన్న రిషి సున‌క్

యూకే జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు టిమ్ బ్యూరోతో భార‌త జాతీయ భద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ డోభాల్ స‌మావేశ‌మై చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇందులో ప్ర‌త్యేకంగా యూకే ప్ర‌ధాన‌మంత్రి రిషి సున‌క్ కూడా పాల్గొన‌డం గ‌మ‌నార్హం. కొన్ని రోజులుగా అజిత్ డోభాల్ విదేశాల్లో ప‌ర్య‌టిస్తున్నారు.

UK-India NSA meeting: యూకే-భార‌త్ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుల స‌మావేశంలో పాల్గొన్న రిషి సున‌క్

Rishi Sunak, the new Prime Minister of Britain, benefit India

Updated On : February 5, 2023 / 1:19 PM IST

UK-India NSA meeting: యూకే జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు టిమ్ బ్యూరోతో భార‌త జాతీయ భద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ డోభాల్ స‌మావేశ‌మై చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇందులో ప్ర‌త్యేకంగా యూకే ప్ర‌ధాన‌మంత్రి రిషి సున‌క్ కూడా పాల్గొన‌డం గ‌మ‌నార్హం. కొన్ని రోజులుగా అజిత్ డోభాల్ విదేశాల్లో ప‌ర్య‌టిస్తున్నారు.

ప‌లు దేశాల అధికారుల‌తో స‌మావేశం అవుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా టిమ్ బ్యారోతో స‌మావేశమై ఇరు దేశాల భ‌ద్ర‌త, వాణిజ్యం, ర‌క్ష‌ణ రంగంలో వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం వంటి అంశాల‌పై చ‌ర్చించారు. ఆయా అంశాల్లో భార‌త్-యూకే బంధం బ‌ల‌ప‌డ‌డానికి రిషి సునక్ హామీ ఇచ్చారు. యూకే కేబినెట్ కార్యాల‌యంలో ఈ స‌మావేశం జ‌రిగింది.

ఇందులోనే రిషి సున‌క్ కూడా పాల్గొన్నారంటూ భార‌త హై క‌మిష‌న్ ట్విట్టర్ లో తెలిపింది. త్వ‌ర‌లోనే టిమ్ కూడా భార‌త్ లో ప‌ర్య‌టిస్తార‌ని వివ‌రించింది. గ‌త మంగ‌ళ‌వారం అమెరికాలో ప‌ర్య‌టించిన అజిత్ డోభాల్ ఆ దేశ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు జేక్ స‌ల్లివాన్ తో స‌మావేశమైన విష‌యం తెలిసిందే. ర‌క్ష‌ణ రంగంలో వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యంపై వారు చ‌ర్చించారు.

Telangana Cabinet Meeting: బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌కు తెలంగాణ కేబినెట్ ఆమోదం.. రూ.3 ల‌క్ష‌ల కోట్ల బ‌డ్జెట్?