Cock Catwalk : అందాలపోటీల్లో ఈ కోడిపుంజు ‘క్యాట్ వాక్’ చూసి తీరాల్సిందే..

అందాలపోటీల్లో ఈ కోడిపుంజు ‘క్యాట్ వాక్’ చూసి తీరాల్సిందే..

Cock Catwalk : అందాలపోటీల్లో ఈ కోడిపుంజు ‘క్యాట్ వాక్’ చూసి తీరాల్సిందే..

Cock Of The Catwalk (1)

Updated On : May 16, 2022 / 4:26 PM IST

Cock of the catwalk : బాగా బలిసిన కోడిపుంజుని చూస్తే వావ్..దీన్ని బిర్యాని చేసుకుని తింటే ఎంత రంజుగా ఉంటుందో అనుకుంటారు మాంసప్రియులు. అటువంటి కోడిపుంజు అందాల పోటీల్లో పాల్గొంటే..ర్యాంప్ మీద ‘క్యాట్ వాక్’ చేస్తే ఎలా ఉంటుందో చూశారా? బహుశా చూసి ఉండకపోవచ్చు.పైగా ఏంటీ కోళ్లకు అందాల పోటీలా? కోడిపుంజు ర్యాంప్ పై ‘క్యాట్ వాక్’ చేయటమా? మరీ విడ్డూరంగా ఉందే అని అనుకుంటాం. వార్నీ కోళ్లకు కూడా అందాల పోటీలా? అని ఆశ్చర్యపోతాం. అటువంటి కోళ్ల అందాల పోటీల్లో చక్కటి సిగతో అదేనండీ నెత్తిమీద కుచ్చుతో స్టేజీమీద హొయలు పోతు ఓ కోడిపుంజు ‘క్యాట్ వాక్’ చూసి తీరాల్సిందే..!

The Bizarre World of Chicken Beauty Pageants Photographed by Ernest Goh | Colossalþ

మలేషియాలోని సెలంగోర్ రాష్ట్రంలోని కంపూంగ్‌ జెంజోరాం ప్రాంతంలో జరిగిన కోళ్ల అందాల పోటీల్లో సెరామా జాతి కోడి పుంజు ఇలా కులుకుతూ హొయలు పోతూ..చక్కగా ఏమాత్రం బెదరకుండా చక్కగా క్యాట్‌ వాక్‌ చేస్తుంటే.. అందరూ చూసి వారెవ్వా ఏమి దీని సోకు అనుకుంటూ తెగ ఆశ్చర్యపోయారు.

The Amazing World of Chicken Beauty Pageants Photographed by Ernest Goh | artFido

సెరమా కోళ్లు తూర్పు ఆసియాకు చెందిన బాంటమ్ జాతి. వీటిని పెంచే యజమానులు వాటిని చక్కగా పెంచి చక్కటి ఆహారం పెట్టి పెంచి ఇలా అందాల పోటీల్లో పెడుతుంటారు. ఈ పోటీలో విజేతగా నిలిచిన కోళ్లకు భారీగా బహుమతులు కూడా అందజేస్తారు. ఈ జాతి కోళ్లు చాతీ ఉబ్బినట్లుగా ఉండి చక్కటి ఆకర్షణీయమైన ఈకలతో అందంగా కనిపిస్తాయి.