Vitamin-C తో కరోనాకు ట్రీట్మెంట్

  • Published By: veegamteam ,Published On : March 3, 2020 / 12:13 PM IST
Vitamin-C తో కరోనాకు ట్రీట్మెంట్

Updated On : March 3, 2020 / 12:13 PM IST

కరోనా (కోవిడ్-19) వైరస్ పూర్తిగా నివారించలేకపోయినా.. కనీసం దరిచేరకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలని చైనా డాక్టర్లు చెబుతున్నారు. ఇందుకు వాళ్లు రీసర్చ్ లో కొత్త విషయాన్ని తెలుసుకున్నారు. అదేంటంటే.. విటమిన్-C తో కరోనా వైరస్ దూరంగా ఉంచచ్చని చెప్పారు. 

అయితే నారింజ పండులో 70mg, టమోటాలో 20mg C విటమిన్ ఉంటుంది. వాటిని తినడం వల్ల మన శరానికి C విటమిన్ లభిస్తోంది. దీని ద్వారా ఒక కరోనా మాత్రమే కాదు, వేరే ఏ వైరస్ లైనా దూరంగా ఉంటాయని శాస్త్రవేతలు  తెలిపారు. C విటమిన్‌ వల్ల తెల్ల రక్త కణాలు పెరిగి రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే చెప్పారు. 

అంతేకాదు వుహాన్‌ యూనివర్శిటీలోని ఝాంగ్‌నాన్‌ హాస్పటల్‌లో 120 మంది కొవిడ్‌ వైరస్‌ బాధితులకు వారం రోజుల పాటు రోజుకు 24 గ్రాముల సీ విటమిన్‌ సప్లిమెంట్లు ఇస్తూ వచ్చారని యూనివర్శిటీ వైద్య వర్గాలు తెలిపాయి. అయితే వారి ప్రయోగ విశేషాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉందని తెలిపారు.