China-Taiwan conflict: తైవాన్ చుట్టూ మళ్ళీ యుద్ధ విన్యాసాలు చేపడతాం.. చైనా ప్రకటన

తైవాన్‌లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ ఇటీవల పర్యటించడంతో చైనా-తైవాన్ మధ్య చెలరేగిన ఉద్రిక్తత చల్లారకముందే యూఎస్ కాంగ్రెస్ సభ్యుల బృందం నిన్న తైవాన్‌లో అడుగుపెట్టింది. దీంతో చైనా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మళ్ళీ యుద్ధ విన్యాసాలు చేపడతామని స్పష్టం చేసింది. తైవాన్ చుట్టూ ఈ విన్యాసాలు కొనసాగుతాయని చెప్పింది. తైవాన్ అధ్యక్షుడు నిన్న యూఎస్ కాంగ్రెస్ సభ్యుల బృందంతో చర్చలు జరిపారు.

China-Taiwan conflict: తైవాన్ చుట్టూ మళ్ళీ యుద్ధ విన్యాసాలు చేపడతాం.. చైనా ప్రకటన

China-Taiwan conflict

Updated On : August 15, 2022 / 2:31 PM IST

China-Taiwan conflict: తైవాన్‌లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ ఇటీవల పర్యటించడంతో చైనా-తైవాన్ మధ్య చెలరేగిన ఉద్రిక్తత చల్లారకముందే యూఎస్ కాంగ్రెస్ సభ్యుల బృందం నిన్న తైవాన్‌లో అడుగుపెట్టింది. దీంతో చైనా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మళ్ళీ యుద్ధ విన్యాసాలు చేపడతామని స్పష్టం చేసింది. తైవాన్ చుట్టూ ఈ విన్యాసాలు కొనసాగుతాయని చెప్పింది. తైవాన్ అధ్యక్షుడు నిన్న యూఎస్ కాంగ్రెస్ సభ్యుల బృందంతో చర్చలు జరిపారు.

తైవాన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని అమెరికా తెలిపింది. తైవాన్ తమ భూభాగమని చైనా అంటోంది. కాగా, సెనేటర్ ఈడీ మార్కే, ప్రతినిధులు జాన్ గరమెండీ, అలన్ లోవెన్తల్, డాన్ బెయర్, అనుమువా అమట కొలెమన్ రడెవాగెన్ తైవాన్‌లో పర్యటిస్తున్నారు. చైనా-తైవాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. శాంతి, స్థిరత్వం కొనసాగేలా నడుచుకోవాలని ఇప్పటికే చైనాకు అమెరికా సూచించింది.

తైవాన్ జలసంధి వద్ద చైనా పాల్పడుతున్న చర్యలు సరికాదని చెప్పింది. నాన్సీ ఫెలోసీ పర్యటన అనంతరం చైనా చేపట్టిన సైనిక విన్యాసాలు ఇటీవలే ముగిశాయి. ఇప్పుడు మళ్ళీ యుద్ధ విన్యాసాలు చేపడతామని చైనా అంటోంది. చైనా నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి తైవాన్ అప్రమత్తంగా ఉంటూ అన్ని చర్యలు తీసుకుంటోంది.

Sperm Cells : పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గిపోవటానికి కారణాలు అనేకం!