ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ : అన్నీ బొద్దింకలే

ఆన్‌లైన్ ఫుడ్.. డబ్బులుంటే చాలు క్షణాల్లో చేతుల్లో వాలిపోతుంది. దీనికి డిమాండ్ పెరుగుతోంది. కానీ చాలా సందర్భాలలో భయం కూడా కలుగుతోంది. కారణం ఫుడ్ ఆర్డర్ ఇస్తే..ఫుడ్ తో పాటు బల్లులు..బొద్దింకలు కూడా వస్తున్నాయి. అంతేకాదు కొంతమంది డెలివరీ బాయ్‌లు మధ్య దారిలోనే ఆహారాన్ని స్వాహా చేసేసయటం..మరికొందరు ప్యాకెట్స్ వార్చేసి క్వాలిటీ లేని ఫుడ్ డెలీవరీ చేయటం వంటి పలు సందర్బాలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల నూడుల్స్‌లో రక్తంతో తడిచిన బ్యాండేజీ..మరోసారి వాడేసిన టిష్యూ పేపర్స్ కూడా బయటపడిన సందర్భాలున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ కస్టమర్ ఆన్‌లైన్లో ఆర్డర్ చేసిన పుడ్ లో బొద్దింకలు బయటపడ్డాయి.
Read Also : ప్రియురాలిని పెళ్లి పీటల మీదే చంపేసిన ప్రియుడు
చైనాకు చెందిన ఓ మహిళ తన స్నేహితులతో కలిసి భోజనం చేయాలనుకుని ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసింది. కానీ చెప్ిన సమయంకంటే లేట్ అయింది. అంతేకాదు ఆకలితో నకనకలాడుతున్న ఆమె ఫ్రెండ్స్ పార్శిల్స్ విప్పి ఆబగా తింటుండగా అందులో చచ్చిపోయిన బొద్దింకలు కనిపించాయి. దీంతో ఆమెకు వామ్టింగ్ చేసుకుంది. మొత్తం ఫుడ్ ను పరిశీలించి చూస్తే దాంట్లో 40కి పైనే బొద్దింకలు కనిపించాయి. ఫుడ్ నుంచి బొద్దింకల్ని బయటకు తీస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తరువాత పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు ఆ ఆహారాన్ని సరఫరా చేసిన రెస్టారెంట్‌పై చర్యలు కూడా తీసుకుంటు..దీనికి సంబంధించిన విచారణ పూర్తయ్యే వరకు 15 రోజుల పాటు రెస్టారెంట్‌ను మూసివేయాలని ఆదేశించారు. ఈ వీడియో వైరల్ గా మారింది.