ఇరాన్ లో కారోనా విజృంభణ : నేడు స్వదేశానికి 58 మంది భారతీయులు
ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపింది. దీంతో నేడు 58 మంది భారతీయులు ఇరాన్ నుంచి బయలుదేరారు.

ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపింది. దీంతో నేడు 58 మంది భారతీయులు ఇరాన్ నుంచి బయలుదేరారు.
కరోనా ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 4వేల 26కు పెరిగింది. లక్షా పదివేల మందికిపైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రపంచదేశాలు కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాయి. ఇరాన్‌లో కరోనా వైరస్ విజృభించడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపింది. దీంతో నేడు 58 మంది భారతీయులు ఇరాన్ నుంచి బయలుదేరారు. తెహ్రాన్ నుంచి భారత వాయుసేన సీయూ విమానంలో ఘజియాబాద్ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఇరాన్ ప్రభుత్వానికి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. (దేవుడికీ తప్పని తిప్పలు : కాశీ విశ్వనాధుడికి కరోనా మాస్క్)
కొవిడ్ 19 వైరస్‌తో ఇరాన్ అతలాకుతలమవుతోంది. ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి ఆ దేశంలో తాజాగా మరో 45 మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 240కి చేరింది. మరో 7వేల మందికి పైగా ఈ వైరస్ బారినపడి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న దాదాపు 70వేల మంది ఖైదీలను విడుదల చేసింది.
ఇక ఈజిప్టులో కరోనా తొలి మరణం నమోదైంది. 60ఏళ్ల జర్మనీ పర్యాటకుడు కరోనా వైరస్‌తో చనిపోయినట్లు నిర్ధారించారు.