Donald Trump: ఇండియన్స్‌ని తీసుకునే రోజులు పోయాయ్.. మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

అమెరికన్ టెక్ కంపెనీలు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికన్ టెక్ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని విమర్శించారు.

Donald Trump: ఇండియన్స్‌ని తీసుకునే రోజులు పోయాయ్.. మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

Donald Trump

Updated On : July 24, 2025 / 5:03 PM IST

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతీయులు టార్గెట్ గా రెచ్చిపోయారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ సంస్థలు భారతీయులను నియమించుకోవద్దన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ సరిగా లేదన్నారు. అంతేకాదు అమెరికన్ల అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదన్నారు. దేశీయంగా ఉద్యోగాలు కల్పించడం మానేసి కొన్ని టెక్ కంపెనీలు.. చైనాలో ఫ్యాక్టరీలు పెట్టడంపైన, భారతీయులకు ఉపాధి కల్పించడంపైన దృష్టి పెడుతున్నాయని ట్రంప్ మండిపడ్డారు.

అమెరికన్ టెక్ కంపెనీలు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికన్ టెక్ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని విమర్శించారు. భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం, ఇతర దేశాల్లో కంపెనీలు పెట్టడం.. ఇకపై అలా జరగదని, తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయన్నారు. ఏఐ రేసులో గెలవాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరం అన్నారు ట్రంప్.

దేశీయంగా అవకాశాల కల్పనపైనే టెక్ కంపెనీలు దృష్టి సారించాలని ట్రంప్ అన్నారు. అమెరికాను, అమెరికన్లను వదిలేసి కొంతమంది చైనాలో ఫ్యాక్టరీల స్థాపన, ఇండియన్స్ కు టెక్ ఉద్యోగాల కల్పనపైనే మనసు పెడుతున్నారని ట్రంప్ విమర్శించారు. టెక్ కంపెనీలు భారతీయులను తీసుకోవద్దు అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇండియన్స్ పై తనకున్న అక్కసును మరోసారి ట్రంప్ వెళ్లగక్కారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read: 50 మందితో వెళ్తూ.. రష్యాలో కూలిన అంగారా ఎయిర్‌లైన్స్‌ విమానం.. కాలిపోయిన స్థితిలో శకలాల గుర్తింపు

ఫస్ట్ అమెరికన్స్ అనే నినాదంతో ట్రంప్ ఎన్నికలకు వెళ్లారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే నినాదంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో పలు మార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలపైన, వాటి జాతీయులపైన ఆయన కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. మరీ ముఖ్యంగా ఇండియన్స్ పై తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారు.

తాజాగా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ సంస్థలు ఇతర దేశీయులను మరీ ముఖ్యంగా భారతీయులను నియమించుకోవద్దని ట్రంప్ అన్నారు. ఏఐ సదస్సులో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ టెక్ కంపెనీలు ఇండియన్స్ కు ఉద్యోగాలు ఇవ్వొద్దని ట్రంప్ ఒక అల్టిమేటమ్ కూడా జారీ చేశారు. దేశీయంగా అవకాశాలపైనే టెక్ కంపెనీలు దృష్టి పెట్టాలని ట్రంప్ అన్నారు.