పక్షవాతం అంటూ వీల్ చైర్‌లో భిక్షాటన…అసలు విషయం తెలిసి షాకైన పోలీసులు

  • Published By: nagamani ,Published On : November 2, 2020 / 02:32 PM IST
పక్షవాతం అంటూ వీల్ చైర్‌లో భిక్షాటన…అసలు విషయం తెలిసి షాకైన పోలీసులు

Updated On : November 2, 2020 / 3:08 PM IST

Egypt Women begging : కళ్లు లేవనీ..కాళ్లు లేవని చాలామంది భిక్షాటన చేస్తుంటారు. కానీ వారు నిజంగా అంగవైక్యం కలవారేనా? అలా నటిస్తూ భిక్షమెత్తుకుంటున్నారా? అనే డౌట్ మనకు వచ్చే ఉంటుంది. అటువంటిదే ఇదిగో ఈ మహిళ కూడా. 57 మహిళ దివ్యాంగురాలిగా నటిస్తూ వీల్ చైర్ లో కూర్చుని వీధుల్లో తిరుగుతూ.. భిక్షమెత్తుకుంటోంది. రోజంతా భిక్షాటన చేసిన తరువాత ఎంచక్కా రెండు కాళ్లతో టకటకా నడుచుకంటూ వెళ్లిపోతోంది. ఈ విషయం తెలిసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. వామ్మో..అంటూ నోరెళ్లబెట్టారు.


వివరాల్లోకి వెళితే..ఈజిప్టుకు చెందిన నఫీసా అనే 57 ఏళ్ల వృద్ధురాలు దివ్యాంగురాలిగా నటిస్తూ వీల్‌చైర్‌లో కూర్చుని భిక్షాటన చేస్తోంది. రోజంతా అలా వీధుల్లో తిరుగుతూ భిక్షాటన చేస్తుంది. సాయంత్రం భిక్షాటన ముగిసిన తర్వాత ఎవరూ లేని సమయంలో అటూ ఇటూ చూసి ఎవ్వరూ తనను గమనించటంలేదని నిర్ధారించుకుని..వీల్‌చైర్‌ను పక్కన పెట్టేసి, ఎంచక్కా నడుచుకుంటూ వెళ్లిపోతోంది.


అది గమనించిన కొంతమంది పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకని ప్రశ్నించటంతో నిజమైన అంగవైకల్యం ఉన్నట్లుగా తెగ డ్రామాలాడింది. తనకు కొంతకాలం క్రితం పక్షవాతం వచ్చిందనీ..ఓ కాలు పనిచేయటంలేదనీ చెప్పింది. కానీ అది నిజంకాదని తేలింది.


దీంతో ఆ మహిళ గురించి పోలీసులు ఆరా తీయగా షాక్ అయ్యే విషయాలు తెలిశాయి. ఆమెకు గర్బియా, ఖలిబుయా గవర్నరేట్స్ వంటి పలు ప్రాంతాల్లో ఐదు సొంత బిల్డింగ్స్ ఉన్నాయని..వాటితో పాటు రెండు బ్యాంకు ఖాతాల్లో మూడు మిలియన్ ఈజిప్షియన్ పౌండ్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 1.42 కోట్లు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు నోరెళ్లబెట్టారు. దీంతో పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు దర్యాప్తు చేపట్టారు.



– – –
మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు అని ఓ తాత నిరూపించాడు. కుండను నెత్తిన మీద పెట్టుకుని విన్యాసం చేశాడు. గుంతలు వచ్చినా అదరలేదు, బెదరలేదు అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. చివరకు ఔరా ‘తాత’ అని అనిపించుకున్నారు. ఈ విన్యాసాన్ని ఆయన వెనుకున్న వారు షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయింది.




విషయానికొస్తే.. ఓ తాత తన నెత్తిన మీద కుండను పెట్టుకుని బైపాస్ రోడ్డుపై బైక్ నడిపాడు. ఎదురు, వెనుక వాహనాలు వస్తున్నా అదరకుండా కిలో మీటర్ల మేర రయ్ రయ్ అంటూ దూసుకెళ్లాడు. వాహనాలు రద్దీగా ఉన్నా వెనక్కి తగ్గలేదు. ఆసక్తికరమైన ఈ విన్యాసాన్ని చూసిన వాహనదారులు ఆశ్చర్యపోయారు.