Elon Musk Twitter: ట్విటర్ లెగసీ బ్లూ చెక్‌ల తొలగింపుపై ఎలాన్ మస్క్ కీలక ప్రకటన

ట్విటర్‌లో మోసగాళ్లు, పేరడీ ఖాతాలను గుర్తించి వినియోగదారులకు సహాయపడటానికి మొదటి సారిగా 2009లో ధృవీకరించబడిన ఖాతాలను ప్రవేశపెట్టింది. గతేడాది మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తరువాత ట్విటర్ బ్లూ టిక్ కలిగిన ఉన్న వారికి రుసుము చెల్లించే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.

Elon Musk Twitter: ట్విటర్ లెగసీ బ్లూ చెక్‌ల తొలగింపుపై ఎలాన్ మస్క్ కీలక ప్రకటన

Twitter CEO Elon Musk

Updated On : April 12, 2023 / 11:26 AM IST

Elon Musk Twitter: ట్విటర్‌ (Twitter) లో బ్లూ చెక్ మార్క్‌  (Blue Check marks) తో లెగసీ వెరిఫైడ్ ఖాతా (legacy verified account)ను కలిగి ఉంటే.. చెక్ మార్క్ ఉంచడానికి మీరు వెంటనే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ట్విటర్ బ్లూ చెక్‌ (Twitter Blue Check) లకు సభ్యత్వం పొందిన ఖాతాలకు మాత్రమే బ్లూ చెక్‌మార్క్‌లను ఉంచుతారు. లేకుంటే, బ్లూ చెక్ మార్క్ తొలగించనున్నారు. ఈ మేరకు ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ (Twitter CEO Elon Musk)  కీలక ప్రకటన చేశారు. ట్విటర్ ఖాతాల నుండి లెగసీ బ్లూ చెక్‌-‌మార్క్‌లను ప్రక్షాళన చేయడానికి మస్క్ దృష్టిపెట్టారు. అయితే, బ్లూ చెక్ మార్క్ కావాలనుకున్న వారు ఏప్రిల్ 20వ తేదీలోపు రుసుము చెల్లించాలి. లేకుంటే ఏప్రిల్ 20 నుంచి బ్లూ చెక్ మార్క్ కోల్పోతారని మస్క్ తెలిపారు.

Elon Musk: ఒబామాను దాటేసిండు..! ట్విటర్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ కలిగిన వ్యక్తిగా ఎలాన్ మస్క్

మస్క్ తన ట్విటర్ ఖాతా ద్వారా బ్లూ చెక్ మార్క్ లను ప్రక్షాళన చేస్తున్నట్లు తెలిపారు. లెగసీ బ్లూ టిక్ లను ఏప్రిల్ 20న తొలగించడం జరుగుతుందని, ఇదే ఫైనల్ డేట్ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ట్విటర్ లో ధృవీకరించబడిన ఖాతాలపై బ్లూ టిక్ ఇకపై వ్యక్తుల ప్రొఫైల్ లలో కనిపించదు. ఈ విషయాన్ని స్వయంగా మస్క్ వెల్లడించారు. ధృవీకరించబడిన ట్విటర్ ఖాతాలకోసం బ్లూ టిక్‌ల పరిమితిని సెట్ చేశారు.

Elon Musk: ఎలాన్ మస్క్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డబ్ల్యూహెచ్ఓ అధినేత

ట్విటర్‌లో మోసగాళ్లు, పేరడీ ఖాతాలను గుర్తించి వినియోగదారులకు సహాయపడటానికి మొదటి సారిగా 2009లో ధృవీకరించబడిన ఖాతాలను ప్రవేశపెట్టింది. మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసే వరకు వీటిపై ఎలాంటి రుసుము విధించలేదు. గతేడాది మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తరువాత ట్విటర్ బ్లూ టిక్ కలిగిన ఉన్న వారికి రుసుము చెల్లించే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఏప్రిల్ 20 నుంచి రుసుము చెల్లించని వారి ఖతాలకు బ్లూ టిక్ ను మస్క్ తొలగించనున్నారు. ట్విటర్‌కి అవసరమైన ఆదాయాన్ని సంపాదించడానికి మస్క్ తాజా చర్యకు ఉపక్రమించారు.

Twitter Blue Verified Tick : ట్విట్టర్ బ్లూ టిక్‌కు డబ్బులు చెల్లించేది లేదు.. తెగేసి చెప్పిన టాప్ కంపెనీలు, ప్రముఖులు.. ఎందుకో తెలుసా?

ట్విటర్లో బ్లూ టిక్ కోసం యూఎస్‌లో నెలకు 8డాలర్లు, ఐఓఎస్, ఆండ్రాయిడ్‍లో యాప్‌లో చెల్లింపు ద్వారా నెలకు 11 డాలర్లు ఖర్చు అవుతుంది. బ్లూ చెక్ – మార్క్‌తో పాటు, 30 నిమిషాల విండోలో ట్వీట్‌లను సవరించగల సామర్థ్యం, 4వేల అక్షరాల వరకు ఎక్కువ ట్వీట్లు, సంభాషణలలో ప్రాధాన్యతా ర్యాంకింగ్‌లతో సహా ఇతర ప్రత్యేక ఫీచర్‌లకు చందాదారులు యాక్సెస్‌లను కలిగిఉంటారు.