కొత్త రకం Mask : మేసెజ్ లను ట్రాన్స్ మిట్ చేస్తుంది..ఇంకా

  • Published By: madhu ,Published On : July 2, 2020 / 09:59 AM IST
కొత్త రకం Mask : మేసెజ్ లను ట్రాన్స్ మిట్ చేస్తుంది..ఇంకా

Updated On : July 2, 2020 / 10:17 AM IST

కరోనా వైరస్ నుంచి కాపాడుకొనేందుకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. రోగ నిరోధక శక్తి పెంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకరి నుంచి మరొకరకి వైరస్ సోకుతుండడంతో…తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సి వస్తోంది. కానీ..చాలా మంది ఈ మాస్క్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నోటిలోకి ఏదైనా పంపించాలంటే..తప్పనిసరిగా మాస్క్ తీయాల్సి ఉంటుంది. అయితే..కొంతమంది బుర్రకు పదును పెట్టి..కొత్త కొత్త రకాల మాస్క్ లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. తాజాగా జపాన్ లోని Donut Robotics అనే స్టార్టప్ సంస్థ సరికొత్త మాస్క్ ను తయారు చేసి రికార్డు నెలకొల్పారు.

ఇంటర్నెట్ తో కనెక్టు అయి..ఉంటుంది c-mask. ఇది మేసేజ్ లను ట్రాన్స్ మిట్ చేయడమే కాకుండా…జపాన్ భాషను మరో ఎనిమిది ఇతర భాషల్లోకి అనువాదం చేస్తుందంట. White Plastic C – Mask అని పేరు పెట్టారు. Bluetooth లో ఓ స్మార్ట్ ఫోన్ కి, టాబ్లెట్ అప్లికేషన్ కి కనెక్ట్ చేయడం విశేషం.

మాటలను టెక్స్ట్ మెసేజులుగా మార్చడం, కాల్స్ చేయగలదని, దీన్ని ధరించిన వారి వాయిస్ (గొంతు) ఎదుటివారికి స్పష్టంగా, గట్టిగా వినబడేట్టు ‘చూడగలదని’ ఈ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ‘టైసుకే ఓనో వెల్లడించారు. ఇంగ్లీషు, చైనీస్, ఫ్రెంచ్, కోరియన్, థాయి, బహాస, స్పానిష్ భాషలకు అనువాదం చేస్తుంది.

కానీ ఈ మాస్క్ లు ఇప్పట్లో రిలీజ్ కావని చెప్పారు. మొదటి 50 వేల C – Maskలు సెప్టెంబర్ లో విడుదల చేస్తామని, దీనిని యునెటైడ్ స్టేట్స్, చైనా, ఐరోపాలోని కొన్ని దేశాల్లో కూడా దీనిని తీసుకరావాలని భావిస్తున్నారు సదరు స్టార్టప్ సంస్థ.

Read:చైనాపై నిషేధం.. దేశీ యాప్ డెవలపర్లకు ఇక పండుగే..!