ఎలుక కష్టాలు : బాబోయ్.. ఇరుక్కుపోయాను.. కాపాడండి!
అదే.. ఎలుక మ్యాన్ హోల్ లో ఇరికిందంటే ఎవరైనా రక్షిస్తారా? కనీసం సాయం చేసేందుకు ముందుకు వస్తారా? చాలామంది ఏముందిలే.. ఎలుకే కదా? అని చూసి చూడనట్టుగా వెళ్లిపోతుంటారు.

అదే.. ఎలుక మ్యాన్ హోల్ లో ఇరికిందంటే ఎవరైనా రక్షిస్తారా? కనీసం సాయం చేసేందుకు ముందుకు వస్తారా? చాలామంది ఏముందిలే.. ఎలుకే కదా? అని చూసి చూడనట్టుగా వెళ్లిపోతుంటారు.
మ్యాన్ హోల్ ఎలుకలకు కొత్తేమి కాదు. మ్యాన్ హోల్స్ దగ్గరే వాటి నివాసం. కొన్నిసార్లు ఎలుకలకు కూడా కష్టాలు తప్పవు. ఎప్పటిలానే ఆహారం కోసం తిరుగుతున్న ఓ ఎలుక అనుకోకుండా మ్యాన్ హోల్ లో ఇరుక్కుపోయింది. సాధారణంగా ఎవరైనా మ్యాన్ హోల్ లో చిక్కుకున్నారంటే.. వెంటనే పోలీసులు, రెస్కూం టీం అప్రమత్తమై వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తారు.
అదే.. ఎలుక మ్యాన్ హోల్ లో ఇరికిందంటే ఎవరైనా రక్షిస్తారా? కనీసం సాయం చేసేందుకు ముందుకు వస్తారా? చాలామంది ఏముందిలే.. ఎలుకే కదా? అని చూసి చూడనట్టుగా వెళ్లిపోతుంటారు. పాపం.. ఎలుక బాధ దానికి మాత్రమే తెలుసు. అయ్య బాబోయ్.. ఎరుక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను.. ఎవరైనా కాపాడండి.. అంటూ దండం పెడుతూ ధీనంగా అడుగుతున్నట్టుగా ఉంది కదా ఈ ఫొటో. నిజానికి ఈ ఘటన జర్మనీలోని బెన్ షీమ్ నగరంలో జరిగింది.
రోడ్డుపై ఉన్న మ్యాన్ హోల్స్ పై నుంచి ఓ ఎలుక దాటే క్రమంలో సడన్ గా అందులో ఇరుక్కుపోయింది. నడుము వెనుక భాగం ఇనుప చట్రంలో ఇరుక్కుపోవడంతో ఎలుక లబోదిబోమంది. రోడ్డుపై వెళ్లేవారంతా ఎలుకను కాపాడేందుకు ఒక్కరూ ముందుకు రాలేదు. ఎవరూ సమాచారం ఇచ్చారో తెలియదు గానీ, యూనిమల్ రెస్య్కూ టీం హుటాహుటినా ఎలుక ఉన్న ప్రాంతానికి బయల్దేరింది.
క్షణాల్లోనే మ్యాన్ హోల్ దగ్గరకు చేరుకొని ఎలుకను రక్షించే పనిలో నిమగ్నమైంది. 25 నిమిషాల పాటు శ్రమించి చివరికి మ్యాన్ హోల్ నుంచి ఎలుక ను రక్షించి బయటకు తీశారు. అంతే.. అమ్మయ్యా.. బతికిపోయాను పో.. అంటూ ఎలుక ఊపిరిపీల్చుకుని అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో..