ఇండియాలో హాకీ ప్రపంచ కప్
భారత గడ్డపై మరో ప్రపంచ సంగ్రామం జరుగనుంది. 2023లో జరుగనున్న ప్రపంచకప్ హాకీ ఛాంపియన్‌షిప్‌కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది.

భారత గడ్డపై మరో ప్రపంచ సంగ్రామం జరుగనుంది. 2023లో జరుగనున్న ప్రపంచకప్ హాకీ ఛాంపియన్‌షిప్‌కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది.
భారత గడ్డపై మరో ప్రపంచ సంగ్రామం జరుగనుంది. 2023లో జరుగనున్న ప్రపంచకప్ హాకీ ఛాంపియన్‌షిప్‌కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని ప్రపంచ హాకీ సంఘం అధికారికంగా ప్రకటించింది. హాకీ ఇండియా, ఒడిషా గవర్నమెంట్ స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా హాకీ ప్రపంచకప్-23ను ఒడిషాలో నిర్వహించనున్నట్లు తెలిపారు. భువనేశ్వర్, రౌర్కేలాలోని మైదానాల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నట్లు హాకీ ఇండియా, ఒడిషా స్పోర్ట్స్ డిపార్టుమెంట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
నాలుగు సార్లు ప్రపంచకప్ నిర్వహించే తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. భారత్‌లో ఇప్పటి వరకు మూడు సార్లు హాకీ ప్రపంచకప్‌లు జరిగాయి. భాతర గడ్డపై తొలిసారి 1982లో హాకీ ప్రపంచకప్ జరిగింది. దీనికి ముంబై నగరం ఆతిథ్యం ఇచ్చింది. రెండో సారి ఢిల్లీ వేదికగా 2010లో పురుషుల ప్రపంచకప్ నిర్వహించారు.
చివరి సారిగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో 2018లో ప్రపంచకప్ జరిగింది. మరోసారి 2023లో భారత్‌లో హాకీ ప్రపంచకప్ జరుగనుంది. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని భారత్‌కు ఈ టోర్నమెంట్ నిర్వహించే అవకాశం దక్కింది. ప్రపంచకప్ కోసం భారత్‌తో సహా మూడు దేశాలు బిడ్‌లు దాఖలు చేశాయి. బెల్జియం, మలేసియాలను వెనక్కినెట్టి భారత్ ప్రపంచకప్ నిర్వహించే అవకాశాన్ని దక్కించుకుంది.