మనకు కరోనా వైరస్ ఎలా సోకుతోంది? ఎలా వ్యాపిస్తుంది? ఇప్పటిదాకా సైంటిస్ట్‌లకు తెలిసిన సంగతులివి

2019 డిసెంబర్ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ లో వెలుగుచూసింది. కొన్ని వారాల తర్వాత కొవిడ్-19 అని పిలవబడే అనారోగ్యానికి కారణమయ్యే వైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారింది. శ్వాసకోశ అనారోగ్యానికి దారి తీసే ఈ వైరస్ ఇప్పుడు దాదాపు 200లకు పైగా దేశాలకు విస్తరించింది. కోటిన్నరకుపైగా ప్రజలు కరోనా బారిన పడ్డారు. 6లక్షల మంది మరణించారు. అసలు కరోనా వైరస్ ఎలా సోకుతుంది? ఎలా వ్యాపిస్తుంది? ఎక్కడెక్కడ ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కరోనా ఇలా వ్యాపిస్తుంది:
కరోనా బాధితుడు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు, పాడినప్పుడు, అతడి నోటి నుంచి ముక్కు నుంచి వచ్చే చిన్న చిన్న తుంపర్ల ద్వారా సన్నిహిత వ్యక్తిగత కాంటాక్ట్ తో కరోనా వ్యాపిస్తుందనే విషయం తెలిసిందే. అలాగే కరోనా బాధితుడు సాధారణంగా గాలి వదిలినప్పుడు కూడా కరోనా వ్యాపించే అవకాశం ఉంది. ఈ తుంపర్లు ఇతరు వ్యక్తుల కళ్లు, ముక్కు, నోరు మీద పడినప్పుడు లేదా శ్వాస తీసుకున్నప్పుడు, చేతి మీద తుంపర్లు పడినప్పుడు కూడా కరోనా బారిన పడే చాన్స్ ఉంది. ఇవి కాకుండా కరోనా అంటువ్యాధి ఇంకా ఏయే మార్గాల్లో వ్యాపించే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్వాస బిందువులు:
కరోనా బాధితుడి నోరు, ముక్కు నుంచి వచ్చే తుంపర్ల ద్వారా ప్రధానంగా కరోనా వైరస్ వ్యాపిస్తుంది. గ్యాస్ క్లౌడ్‌లోని వెచ్చని, తేమతో కూడిన వాతావరణం బాష్పీబవనాన్ని(evaporation) ఆలస్యం చేస్తుంది, అయితే వాయు ప్రవాహం వ్యాధికారక-మోసే బిందువుల పేలోడ్‌ను మేఘం వెలుపల ఉన్నదానికంటే ముందుకు నడిపించడంలో సహాయపడుతుంది. దగ్గినప్పుడు గాలిలో 4 నుంచి 5 మీటర్లు(13-16 ఫీట్) వరకు వైరస్ కణాలు వ్యాపిస్తాయి. తుమ్మినప్పుడు వైరస్ కణాలు 8 మీటర్ల వరకు వ్యాపిస్తాయి. వైరస్ కణాలు ఎంత దూరం వరకు గాలిలో వ్యాపిస్తాయి అనేది హ్యుమిడిటీ, ఉష్ణోగ్రతల మీద ఆధారపడి ఉంటుంది. కరోనా వైరస్ కణాలు గాలిలో ఉన్న సమయంలో ఎవరైనా సమీపంలో ఉంటే వారి కళ్లు, ముక్కు, నోటిలోకి కణాలు దూరి కరోనా సోకే అవకాశం ఉంది.
కరోనా బాధితుల్లో 15 రోజుల వరకు వైరస్ యాక్టివ్ గా ఉంటుంది:
స్థిరపడిన తుంపర్లు ఉపరితలాన్ని కలుషితం చేస్తాయి. దాన్ని ఫొమైట్ అంటారు. ఈ ఫొమైట్ ను చేతితో టచ్ చేసినా కరోనా సోకే అవకాశం ఉంది. ఉదాహరణకు డోర్ నాబ్ లేదా యుటెన్ సిల్స్. ఆ తర్వాత నోరు, ముక్కు లేదా కళ్ల ద్వారా కాంటాక్ట్ కావడం వల్ల వైరస్ బారిన పడే చాన్స్ ఉంది. కరోనా బారిన పడ్డ వ్యక్తుల్లో 15 రోజుల వరకు సలైవా(లాలాజలం), వారు వాడే కుర్చీ, మూత్రంలో కరోనా వైరస్ కణాలు ఉంటాయి. కరోనా బారిన పడ్డ వ్యక్తితో 15 నిమిషాలు పాటు సన్నిహితంగా ఉండటం(1.8 మీటర్ల దూరంలో), అలాగే దగ్గుతున్న లేదా తుమ్ముతున్న వ్యక్తితో కాంటాక్ట్ లో ఉంటే కరోనా సోకే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
ఏ వస్తువుపై ఎంతసేపు వైరస్ సజీవంగా ఉంటుంది:
తనకు అనువైన వాతావరణంలో కరోనా వైరస్ చాలా సేపు స్థిరంగా ఉంటుంది. సున్నా డిగ్రీ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతంలో ఏకంగా కొన్ని వారాల పాటు వైరస్ బతికే ఉంటుంది. రూమ్ టెంపరేచర్ విషయానికి వస్తే కార్డ్ బోర్డుపై 24 గంటలు, స్టెయిన్ లెస్ స్టీల్ పై 48 గంటలు, ప్లాస్టిక్ పై 72 గంటలు పాటు వైరస్ బతికే ఉంటుంది. స్టాండర్డ్ డిస్ ఇన్ ఫెక్షన్ల(క్రిమి సంహారక) తో వైరస్ ను చంపొచ్చు.
తరుచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి:
కరోనా నుంచి కాపాడుకోవాలంటే, తరుచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి. ఎక్కువగా బయట తిరిగే వ్యక్తులకు దూరంగా ఉండాలి. కొన్ని రోజుల పాటు షేక్ హ్యాండ్, హగ్, కిస్సింగ్ కు దూరంగా ఉండాలి. ఎవరైనా కరోనా బారిన పడినా, కరోనా లక్షణాలు కనిపించినా వెంటనే ఆ వ్యక్తిని వేరే రూమ్ లో క్వారంటైన్ చేయాలి. గదిని క్రిమి సంహారక మందులతో క్లీన్ చేయాలి. ఇంట్లోని స్విచ్చులు, టేబుల్స్, రిమోట్లను తరుచుగా శుభ్రం చేయాలి. ఇక జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, బస్సుల్లో కచ్చితంగా ప్రతి ఒక్కరూ మాస్కులు కచ్చితంగా ధరించాలి. మెడికల్ మాస్కులు అందుబాటులో లేకపోతే ఇంట్లో తయారు చేసిన మాస్కులు ధరించాలి.
చిన్న గాలి తుంపర్లు:
కరోనా బాధితుడి నోరు లేదా ముక్కు నుంచి వచ్చే చిన్న చిన్న తుంపర్లను గ్యాస్ క్లౌడ్స్ చాలా మీటర్ల వరకు మోసుకెళ్తాయి. సరైన వెంటిలేషన్, గాలి వడపోత సరిగా లేని ఇండోర్ ప్రాంతాలు, క్లోజ్డ్ ఎన్విరాన్ మెంట్లలో తుంపర్లు ఎక్కువ దూరం వరకు ప్రయాణించడానికి కారణం అవుతాయి. గాలి ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందని ఇటీవలే పలువురు శాస్త్రవేత్తలు చెప్పిన విషయం తెలిసిందే. యాక్టివ్ వైరస్ కణాలు గాలిలో ప్రయాణించగలవని (దాదాపు 3 గంటల సేపు) ఇటీవలే పరిశోధకులు గుర్తించారు. గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుంది అనే వాదనను కొట్టిపారేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పింది.
ఐసీయూ కేంద్రాల్లో వైరస్:
ప్రపంచవ్యాప్తంగా మీట్(మాంసం) ప్రాసెసింగ్ ప్లాంట్లు వైరస్ కు కేంద్రాలుగా మారుతున్నాయి. చల్లగా ఉన్న వాతావరణ పరిస్తితుల్లో వైరస్ కణాలు గాలిలో 8 మీటర్ల ఎత్తు వరకు ప్రయాణం చేస్తాయని, తద్వారా కరోనా ఇతరులకు వ్యాపిస్తుందని ఇటీవలే జర్మనీ పరిశోధకులు తేల్చారు. ఐసీయూ కేంద్రాలు చాలా ప్రమాదకరం అని పరిశోధనల్లో తేలింది. కరోనా బాధితుల ముక్కులో పెట్టే వెంటిలేటర్ ట్యూబ్స్ కారణంగా వైరస్ స్ప్రెడ్ అయ్యే చాన్స్ ఎక్కువగా ఉంది. ఐసీయూలో ఇలాంటి పరిస్థితి లేకుండా చేయాలంటే, ప్రతి 12గంటలకు ఒకసారి ఆ రూమ్ లోని గాలిని బయటకు పంపేయాలి.
ఆసుపత్రి గదుల్లో కరోనా:
కరోనా బాధితులు చికిత్స తీసుకునే గదుల్లోని గాలిలో, ఉపరితలాలపై వైరస్ కణాలు ఉంటున్నాయి. చైనాలో పలు ఆసుపత్రుల్లో గాల్లో కరోనా వైరస్ కణాలను గుర్తించడం జరిగింది. ఆసుపత్రిలో పని చేసే సిబ్బంది తాము వాడిన మాస్కులు, గౌన్లు తీసి పారేసినప్పుడు.. ఆసుపత్రి ఫ్లోర్ ని క్లీన్ చేసినప్పుడు వైరస్ కణాలు బయటపడుతున్నాయి. ఈ కారణంగానే కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్య సిబ్బంది కచ్చితంగా ఫేస్ మాస్కులు వేసుకోవాలని(ఎన్95) నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత వాటిని చాలా జాగ్రత్తగా డిస్పోజ్ చేయాలి.
నీరు లేదా ఆహారం:
నీరు లేదా ఆహారం లేదా ఫుడ్ ప్యాకింగ్ ద్వారా కరోనా వస్తుందని చెప్పడానికి అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే ఆహారం సరఫరా చేసే వారు మంచి హైజిన్ పాటించాలి. అలాగే పని చేసే చోట ఉపరితలాలను తరుచుగా శుభ్రం చేయడంతో పాటు క్రిమి సంహారక మందులు చల్లాలి. తర్వారా కలుషితం అయ్యే ప్రమాదాన్ని తగ్గించొచ్చు. అలాగే గోరు వెచ్చని నీరు తాగడం, ఉడకబెట్టని ఆహారం తినకపోవడం, చేతులు తరుచూ శుభ్రం చేసుకోవడం, కరోనా బాధితుల ద్వారా నీరు, ఆహారం కలుషితం కాకుండా చూసుకోవడం. అమెరికా అధికారుల ప్రకారం, మున్సిపల్ తాగు నీటి సరఫరాలో కరోనా వైరస్ ను గుర్తించలేదు. కన్వెన్షనల్ ట్రీట్ మెంట్ పద్దతులు, ఫిల్టరేషన్, డిస్ ఇన్ ఫెక్షన్ లాంటి వాటితో వైరస్ ని తొలగించవచ్చు లేదా తొలగించవచ్చు.
జంతువులు:
సార్స్ కోవ్ -2 బ్యాట్స్(గబ్బిలాలు) నుంచి వచ్చిందని, మనుషుల్లో వ్యాప్తి చెందిందని నిపుణుల అభిప్రాయం. దాదాపు 12 జంతువుల స్పీసిస్ కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అనే అనుమానాలు ఉన్నాయి. మనుషుల ద్వారా పెంపుడు కుక్కలు, పిల్లులకు.. బ్రాంక్స్ జూలోని పులులు, సింహాలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. జంతువుల ద్వారా సార్స్ కోవ్ 2 రావడం చాలా అరుదు. కాగా మింక్ అనే జంతువు ద్వారా ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకినట్టు నెదర్లాండ్స్ లో గుర్తించారు. కరోనా వైరస్ వ్యాప్తిని చేయడంలో జంతువులు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయని చెప్పడానికి ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లేవు.
మలంలో కరోనా:
కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి మరో ప్రధాన కారణం కరోనా బాధితులు టాయిలెట్ కి వెళ్లి వచ్చాక సరిగా చేతులు శుభ్రం చేసుకోకపోవడం. వారు అలాగే వచ్చి ఉపరితలాలను ముట్టుకోవడం, ఇతరులతో కాంటాక్ట్ కావడం. కొందరి మలంలో కరోనా వైరస్ కణాలను గుర్తించడం జరిగింది. అయితే మలం ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుంది అనేదానికి శాస్త్రీయ ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇలాంటి వ్యాప్తిని అరికట్టాలంటే చేతులను బాగా శుభ్రం చేసుకోవడంతో పాటు బాత్ రూమ్, ఆహారం తయారు చేసే ప్రాంతాలను శానిటైజ్ చేయాలి.
తల్లి నుంచి బిడ్డకు:
అప్పుడు పుట్టిన కొందరు పసికందుల్లో కరోనా వైరస్ ను గుర్తించడం జరిగింది. దీంతో తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిండానికి వైరస్ సోకి ఉంటుందా అనే సందేహాలు తలెత్తాయి. అయితే కరోనా బారిన పడ్డ గర్భిణులు ప్రసవించిన బిడ్డలకు కొందరికి కరోనా లేకపోవడం కూడా గుర్తించారు. అమ్నియోటిక్ ద్రవం, త్రాడు రక్తం, పిల్లల గొంతులో లేదా తల్లి పాలలో ఏ వైరస్ కనుగొనబడలేదు. ఇది తల్లి నుండి బిడ్డకు శ్వాసకోశ బిందువుల ద్వారా సంభవిస్తుందని తెలిసింది.