ఖతార్‌లో మరణశిక్ష పడిన 8 మంది నేవీ మాజీ అధికారులను ఎందుకు విడుదల చేశారో తెలుసా?

ఆ ఎనిమిది మందిని విడుదల చేయించేందుకు భారత ప్రభుత్వ అధికారుల టీమ్ కొన్ని వారాలుగా ఖతార్‌లో ఉంది.

ఖతార్‌లో మరణశిక్ష పడిన 8 మంది నేవీ మాజీ అధికారులను ఎందుకు విడుదల చేశారో తెలుసా?

అంతర్జాతీయంగా భారత్ ఎలాంటి ప్రభావాన్ని చూపగలదో తెలిపేందుకు ఉదాహరణ ఇది. ఖతార్‌లో గూఢచర్య ఆరోపణలపై మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారత నౌకా దళ మాజీ అధికారులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.

అయితే, మరణశిక్ష పడినవారిని విడుదల చేయడానికి కారణం ఏంటి? ఇందులో భారత ప్రభుత్వ పాత్ర ఏదైనా ఉందా? కెప్టెన్ నవతేజ్ గిల్‌తో పాటు సౌరభ్ వశిష్ఠ, అమిత్ నాగ్‌పాల్, పూర్ణేందు తివారీ, ఎస్కే గుప్తా, బీకే వర్మ, రాగేశ్, సుగుణాకర్ పాకాల విడుదల కావడంతో చక్రం తిప్పింది ఎవరు?

ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఆ ఎనిమిది మందిని విడుదల చేయించేందుకు భారత ప్రభుత్వ అధికారుల టీమ్ కొన్ని వారాలుగా ఖతార్‌లో ఉంది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ తో పాటు కొందరు అధికారులు ఇందులో కీలక పాత్ర పోషించారు. పలుసార్లు ఖతార్ కు వెళ్లి మరీ అజిత్ డోభాల్ చర్చలు జరిపారు.

అలాగే, ప్రధాని మోదీ దుబాయ్‌కు కాప్-28 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన సమయంలో ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్‌తోనూ చర్చలు జరిపారు. ఖతార్‌లోని భారతీయ కమ్యూనిటీ గురించి వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు ప్రభుత్వం తెలియజేసింది.

ఓ అధికారి దీనిపై మాట్లాడుతూ.. తాము భారత్‌కు మళ్లీ రావడానికి ఏడాదిన్నర పాటు ఎదురు చూశామని తెలిపారు. మోదీకి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. మోదీ జోక్యంతో పాటు ఖతార్‌తో అధికారుల చర్చల వల్లే ఎనిమిది మంది అధికారులు విడుదలయ్యారని చెప్పారు.

Farmers Protest: ఢిల్లీలో రైతుల ఆందోళన.. ఏం జరుగుతుందో తెలుసా? ఎటుచూసినా వారే..