కరోనా బాధిత ఇరాన్‌కు భారత యుద్ధ విమానం

కరోనా బాధిత ఇరాన్‌కు భారత యుద్ధ విమానం

Updated On : March 9, 2020 / 5:04 PM IST

భారతీయులను ఇరాన్ నుంచి భారత్‌కు తీసుకొచ్చేందుకు ఇరాన్ కు బయల్దేరింది IAF C-17. వారి కోసం మిలటరీ ట్రాన్స్‌పోర్ట్ మాత్రమే కాదు మెడికల్ టీంను కూడా తీసుకెళ్లారు. సోమవారం రాత్రి 8గంటల 30నిమిషాల సమయానికి తిరుగు ప్రయాణం కానున్నట్లు ఐఏఎఫ్ అధికారులు వెల్లడించారు.  సోమవారం తెల్లవారుజాము సమయానికి భారత్‌కు చేరుకుంటారని అన్నారు. 

ఇరాన్‌లో దాదాపు 2వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. కొద్ది రోజులుగా ఆ దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతుండటంతో వారంతా భారత్‌కు రావాలని ప్రయత్నిస్తున్నారు. ఇటీవల అందిన సమాచారం ప్రకారం.. ఇరాన్‌లో 237మంది కరోనా ఇన్ఫెక్షన్‌తో చనిపోయినట్లు తెలుస్తుంది. పైగా ఒక 7వేల మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ సోమవారం కశ్మీర్‌కు సర్‌ప్రైజ్‌ విజిట్ చేసి కరోనా వైరస్ సోకిన స్టూడెంట్లను పరామర్శించారు. తల్లిదండ్రులు ఇరాన్‌లో చిక్కుకుపోయారని స్టూడెంట్లు మంత్రికి విజ్ఞప్తి చేశారు. కరోనా పేషెంట్లను తీసుకురావడానికి భారత ప్రభుత్వం యుద్ధ విమానాలు పంపడం ఇది రెండో సారి.

ఫిబ్రవరి 27న భారత ఎయిర్‌క్రాఫ్ట్‌లో చైనాలోని వూహాన్ సిటీ నుంచి 76మంది భారతీయులతో పాటు 36మంది విదేశీయులను తీసుకువచ్చారు. భారత్‌లో ఇప్పటివరకూ 43కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. రిపోర్ట్‌ల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 100దేశాల్లో కరోనా కేసులు లక్షా 10వేలు నమోదైనట్లు గుర్తించారు.