డేట్ కూడా చెప్పేశాడు : పాక్ పై మరో దాడికి భారత్ రెడీ!

  • Published By: venkaiahnaidu ,Published On : April 7, 2019 / 03:17 PM IST
డేట్ కూడా చెప్పేశాడు : పాక్ పై మరో దాడికి భారత్ రెడీ!

Updated On : April 7, 2019 / 3:17 PM IST

పాకిస్తాన్ పై మరోసారి దాడి చేయాలని భారత్ ఫ్లాన్ చేస్తోందని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషీ అన్నారు.నమ్మకమైన ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఈమేరకు తమ ప్రభుత్వానికి సమాచారమందిందని ఆయన తెలిపారు.

ఆదివారం(ఏప్రిల్-7,2019)ముల్తాన్ లో మీడియా సమావేశంలో ఖురేషీ మాట్లాడుతూ…పాక్ పై భారత్‌ కొత్త దాడికి పథకం రచిస్తోందన్నారు.తమకు అందిన సమచారం మేరకు ఏప్రిల్‌ 16-20వ తేదీ మధ్యలో ఆ దాడి జరిగే అవకాశముందని అన్నారు. భారత్ లోని అధికార పార్టీ యుద్ధం కోసం తపిస్తోందని అన్నారు. ఈ విషయాన్ని తాము ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలకు తెలిపినట్లు చెప్పారు.  కేవలం పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అనుమతితో ఈ విషయాన్ని దేశప్రజలకు వెల్లడించానని తెలిపారు.