ఈ బెకా డీల్ ఎందుకు..? ట్రంప్ ఇండో అమెరికన్ ఓట్లపై టార్గెట్ పెట్టారా?

ఇప్పుడే ఈ డీల్ ఎందుకు..? బెకా డీల్‌ వెనుక పాలిటిక్స్ ఉన్నాయా..? ట్రంప్ ఇండో అమెరికన్లపై సెంటిమెంట్ బాణం వేస్తున్నారా..? ఈ సందేహాలే ఇప్పుడు కలకలం రేపుతున్నాయ్.. ఐతే భారత్ మాత్రం బేస

ఈ బెకా డీల్ ఎందుకు..? ట్రంప్ ఇండో అమెరికన్ ఓట్లపై టార్గెట్ పెట్టారా?

Updated On : December 29, 2021 / 10:49 AM IST

Donald Trump – Indian-American Votes : ఇప్పుడే ఈ డీల్ ఎందుకు..? బెకా డీల్‌ వెనుక పాలిటిక్స్ ఉన్నాయా..? ట్రంప్ ఇండో అమెరికన్లపై సెంటిమెంట్ బాణం వేస్తున్నారా..? ఈ సందేహాలే ఇప్పుడు కలకలం రేపుతున్నాయ్.. ఐతే భారత్ మాత్రం బేసిక్ ఎక్స్‌ఛేంజ్ అండ్ కోఆపరేషన్ ఒప్పందం వెనుక ఎలాంటి రాజకీయం లేదని చెప్తోంది.

షెడ్యూల్ ప్రకారమే అమెరికా మంత్రులు వచ్చారని విదేశాంగ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇండో అమెరికన్ ఓట్లపై టార్గెట్ పెట్టారని అంటున్నారు.

వరసగా వచ్చిన సర్వేల్లో డెమోక్రటిక్ అభ్యర్ధి జో బైడెనే ముందంజలో ఉన్నట్లు తేలడంతోనే ట్రంప్ తనకి ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటున్నారు. ఇందులో భాగంగానే బెకా డీల్‌ని ఫాస్ట్ ట్రాక్‌పై కంప్లీట్ చేశారనే వాదన ఉంది.

జో బైడెన్-కమలాహారిస్ పెయిర్‌కే అమెరికా ఓటర్లు జై కొడుతున్నారనే సర్వేల మధ్య ఇండో అమెరికన్ ఓట్లు కీలకంగా మారాయ్.

భారీ సంఖ్యలో ఉన్న ప్రవాస భారతీయలను ప్రసన్నం చేసుకునేందుకు ట్రంప్ మొదట్నుంచీ ప్రయత్నం చేస్తున్నారు.

గత వారం జూనియర్ ట్రంప్ కూడా ఇదే రకం ప్రచారం చేసారు. డొనాల్డ్ ట్రంప్ కనుక గెలవకపోతే.. అది భారత్‌కి చెడు చేస్తుందని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ప్రచారం కూడా చేపట్టారు.

జో బైడెన్ గెలిస్తే చైనాకి అనుకూలమని.. అది భారత్‌కి మంచి కాదంటూ క్యాంపెయిన్ చేశారాయన.

ఇప్పుడు దానికి కొనసాగింపుగానే.. బెకా డీల్‌ని వాడుకునే అవకాశాలు కన్పిస్తున్నాయ్. భారత్‌కి ట్రంప్ పాలనాయంత్రాంగం ఎంతో మేలు చేస్తుందని.. అందుకే ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి రక్షణ రంగపు ఒప్పందాలు చేసుకుందని చెప్పడమే ఇందులో కాన్సెప్ట్ బోర్డర్ దగ్గర ఇండియాకి ఎదురవుతున్న సమస్యల్లో తాను.. తన ప్రభుత్వం ఎంతో సాయపడినట్లు ట్రంప్ చెప్పుకుంటున్నారు.

అందుకు తగినట్లుగానే బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కో ఆపరేషన్ డీల్ కుదిరింది. ఐతే ట్రంప్ స్కెచ్‌ని జో బైడెన్ కూడా సమర్ధవంతంగానే ఎదుర్కొంటున్నారు.

ఒబామా హయాంలోనే తాము భారత్‌తో రక్షణ రంగంలో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం చేస్తున్నారు.

ట్రంప్ భారత్‌ని మురికిదేశమంటూ కామెంట్ చేయడాన్ని కూడా కౌంటర్ చేశారు. దీంతో ఓ రకంగా బెకా డీల్ కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓ అస్త్రంగా మారనుంది.

వాస్తవానికి అమెరికా మంత్రులు ఇద్దరు భారత్ వస్తున్న సంగతి రెండు రోజుల ముందు వరకూ ఎక్కడా ప్రస్తావన లేదు.

అందుకే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ భారత్‌తో ఉందన్న కలరింగ్ ఇచ్చేందుకే ఇలా చకచకా ఒప్పందాన్ని కుదుర్చు కున్నారనేది చాలామంది చెప్తున్నమాట.

ఎందుకంటే.. భారత్ సహా శ్రీలంక, మాల్దీవులు, ఇండొనేషియా పర్యటనలకు మైక్ పాంపియో.. ఎస్పేర్‌లు వెళ్తున్నారు.

ఇక్కడ కూడా యాంటీ చైనా ఎస్టాబ్లిష్‌మెంట్‌ పేరుతో అమెరికాలో స్థిరపడిన ఈ దేశీయుల ఓట్లపై గురి పెట్టారంటున్నారు.

ఈ రాజకీయ కారణాలను..వాదనలను పక్కనబెడితే..బెకా ఒప్పందంతో భారత్ లాంగ్ రేంజ్ మిస్సైల్ పవర్స్ గ్రూప్ దేశాల్లో చేరిపోయింది.

లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా గురి తప్పకుండా చేధించగల సామర్ధ్యం ఒనగూరుతుంది.

సాధారణంగా..లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఇనర్షియల్ నేవిగేషన్ సిస్టమ్‌తో పని చేస్తాయ్.

దీంతో కొంతమేర లక్ష్యం తప్పే అవకాశం ఉంటుంది.. ఐతే అమెరికాకి చెందిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్‌తో ఆ కాస్త తేడాని కూడా సవరించడం సాధ్యపడుతుంది.

ఐఎన్ఎస్ పద్దతిలో ప్రయోగించే మిస్సైల్స్‌తో లక్ష్యం గురి తప్పే పరిధి 100 మీటర్ల వరకూ ఉంటే..జిపిఎస్‌తో అనుసంధానించబడిన మిస్సైల్స్‌లో గురి తప్పే పరిధి ఒక మీటర్ మాత్రమే ఉఁటుంది.

అమెరికాకి మాత్రమే సొంతమైన జిపిఎస్‌ సర్వీస్ పొందాలంటే ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవాల్సిందే..ఇప్పుడు భారత్ అమెరికాతో డీల్ సెట్ చేసుకుంది కాబట్టి.. కేవలం సమాచారం మాత్రమే కాదు.

అడ్వాన్స్‌డ్ నేవిగేషనల్ సాయంతో పాటు.. గ్లోబ్ మాస్టర్ సీ 17 హెలికాప్టర్లు.. సూపర్ హెర్క్యులస్, p 8 పోసీడాన్ యుద్ధవిమానాలకు కూడా జిపిఎస్ అనుసంధానం కుదురుతుంది.

ఈరకపు విమానాలను సరఫరా చేసేందుకే 2018లో అమెరికాతో మనం ఒప్పందం కుదుర్చుకోగా..ఇప్పుడు నాలుగో ఒప్పందమైన బెకాతో వాటిని అరివీరభయంకరంగా వినియోగించేందుకు వీలు కలుగుతుంది.

సీ 3 గ్లోబ్ మాస్టర్ కానీ..సూపర్ హెర్క్యులస్, పోసీడాన్ కానీ..ఈ మూడూ కూడా గతంలో అమెరికా కేవలం వాణిజ్యపరమైన కమ్యూనికేషన్ కోసం మాత్రమే సరఫరా చేసింది. ఐతే అందుకోసం అమెరికాతో ప్రత్యేకమైన ఒప్పందాలు చేసుకుంటేనే కుదిరేది.

2018లో భారత్ చేసుకున్న ఒప్పందం కూడా ఇలాంటిదే.. ఐతే బెకా డీల్‌తో ఇక వాటిని యుద్ధ అవసరాల కోసం కూడా వినియోగించుకోవడానికి పూర్తిగా వనరులు సమకూరినట్లే.. మొత్తం మీద బేసిక్ అగ్రిమెంట్ అండ్ కోఆపరేషన్-బెకా ఒప్పందం పూర్తి కావడంతో అమెరికాకి భారత్ పూర్తి స్థాయి రక్షణరంగ భాగస్వామిగా మారినట్లయిందని అంటున్నారు