Jio satellite communication: ఎలాన్ మస్క్‌తో ముకేశ్ అంబానీ పోటీ.. ‘జియో’కు శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసుల కోసం ఎల్వోఐ
పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి చెందిన జియో ఇన్ఫోకామ్ శాటిలైట్ యూనిట్‌కు శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసుల కోసం టెలికాం శాఖ నుంచి నిన్న లెటర్ ఆఫ్ ఇంటెంట్(ఎల్వోఐ) జారీ అయింది. దీని ద్వారా శాటిలైట్ ఆధారిత అంతర్జాతీయ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ (జీఎమ్‌పీసీఎస్) సేవలను జియో అందించే అవకాశం లభించింది. ఎల్వోఐ జారీ కావడంతో జీఎమ్‌పీసీఎస్ సేవలను లైసెన్స్‌డ్ సర్వీస్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయవచ్చు.

Jio satellite communication
Jio satellite communication: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి చెందిన జియో ఇన్ఫోకామ్ శాటిలైట్ యూనిట్‌కు శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసుల కోసం టెలికాం శాఖ నుంచి నిన్న లెటర్ ఆఫ్ ఇంటెంట్(ఎల్వోఐ) జారీ అయింది. దీని ద్వారా శాటిలైట్ ఆధారిత అంతర్జాతీయ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ (జీఎమ్‌పీసీఎస్) సేవలను జియో అందించే అవకాశం లభించింది. ఎల్వోఐ జారీ కావడంతో జీఎమ్‌పీసీఎస్ సేవలను లైసెన్స్‌డ్ సర్వీస్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయవచ్చు.
దీని నిర్వహణ కోసం పూర్తి స్థాయిలో అనుమతులు రావాల్సి ఉంది. అందుకోసం ప్రభుత్వ నిబంధనల ప్రకారం జియో ప్రణాళికను పూర్తి చేయాల్సి ఉంటుంది. తుది అనుమతులు వచ్చాక దాదాపు 20 ఏళ్ల పాటు జియోకు లైసెన్సు వర్తిస్తుంది. జియో వాయిస్, డేటా సర్వీసులు అందిస్తుంది. అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్‌కు స్పేస్ ఎక్స్, భారతీయ పారిశ్రామికవేత్త సునీల్ మిత్తల్‌కు చెందిన వన్ వెబ్‌లతో ముకేశ్ అంబానీ పోటీపడతారు.
జియో మొబైల్ శాటిలైట్ నెట్‌వర్క్‌లను నిమ్న కక్ష్య (భూమికి 2 వేల కి.మీ.ల ఎత్తు వరకు), మధ్యస్థ కక్ష్య (20,200 కి.మీ.ల ఎత్తువరకు), జియోసింక్రనస్(జీఈఎస్) శాటిలైట్ల ద్వారా ఆపరేట్ చేస్తారు. శాటిలైట్ ఆధారిత బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల కోసం లగ్జెంబర్గ్ ఎస్‌ఈఎస్‌తో కలిసి పనిచేస్తామని, ఈ మేరకు జాయింట్ వెంచర్ ప్రారంభిస్తున్నట్లు ఇప్పటికే ‘జియో’ ప్రకటించింది.
Russia Ukraine war: ఉక్రెయిన్ తిరిగి తమ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటోంది: అమెరికా