McAfee Antivirus: మెకఫీ యాంటీవైరస్ క్రియేటర్ ఆత్మహత్య

బ్రిటీష్ లో పుట్టి అమెరికాలో ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదిగిన John McAfee బుధవారం బార్సిలోనాలో ఖైదీగా ఉంటూ ఆత్మహత్య చేసుకున్నారు. స్పానిష్ కోర్టు విచారణ జరిపి ట్యాక్స్ కట్టకపోవడం వంటి కారణాలతో జైలులో ఉంచింది.

McAfee Antivirus: మెకఫీ యాంటీవైరస్ క్రియేటర్ ఆత్మహత్య

Mcafee

Updated On : June 24, 2021 / 12:51 PM IST

McAfee Antivirus: బ్రిటీష్ లో పుట్టి అమెరికాలో ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదిగిన John McAfee బుధవారం బార్సిలోనాలో ఖైదీగా ఉంటూ ఆత్మహత్య చేసుకున్నారు. స్పానిష్ కోర్టు విచారణ జరిపి ట్యాక్స్ కట్టకపోవడం వంటి కారణాలతో జైలులో ఉంచింది.

ఎంసీఏఫీ లాయర్ జేవియర్ విల్లల్బా మాట్లాడుతూ.. తొమ్మిది నెలల పాటు జైలు ఉంచడంతో నైరాశ్యానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. గత నెల మెకఫీ (75) తాను దోషిగా రుజువైతే మిగతా జీవితమంతా జైలులో గడపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

‘స్పానిష్ కోర్టు ఇందులో అన్యాయం చేస్తుందనుకుంటున్నా. అమెరికా ప్రభుత్వం నన్నొక ఉదాహరణగా చూపించడానికే ఇలా చేస్తుంది’ అని ఆరోపణలు చేశారు ఎంసీఏఫీ.. కొన్ని ప్రత్యేక కారణాలతో అమెరికా ప్రభుత్వానికి ట్యాక్స్ సంవత్సరాల నుంచి కట్టకుండా పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాతే క్రిప్టోకరెన్సీ కేసులు ఫైల్ అయ్యాయి.

ఈ క్రమంలో ఎంసీఏఫీ కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో ఉండి పరారీ అయ్యాడు. న్యూయార్క్ లో అతనిపై క్రిప్టో కరెన్సీ కేస్ బుక్ అయింది. గతేడాది అక్టోబరు 3న ఇస్తాంబుల్ వెళ్తుండగా బార్సిలోనా ఎయిర్ పోర్టులో బ్రిటిష్ పాస్ పోర్టుతో ప్రయాణిస్తుండగా పట్టుకున్నట్లు స్పానిష్ పోలీసులు చెప్పారు.

అతని మృతిపై క్రిప్టోకరెన్సీ బ్యాకర్స్ అంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మెకఫీ అతని లాస్ట్ ట్వీట్ లో ఇలా రాశాడు. అధికారమంతా కరప్ట్ అయిపోయింది. ప్రజాస్వామ్యంలో బతకడానికి ఏదైనా అధికారం తోడ్పడుతుంటే దానిని కాపాడుకోండి అంటూ చివరిసారిగా జూన్ 18న ట్వీట్ చేశాడు.