Kamala Harris: హిప్ హాప్ డ్యాన్స్ చేసిన కమలా హ్యారీస్.. వీడియో వైరల్

హిప్ హాప్ ట్యూన్స్ కు తగ్గట్టు కమలా హ్యారీస్ డ్యాన్స్ చేయడం ఇందులో చూడొచ్చు.

Kamala Harris: హిప్ హాప్ డ్యాన్స్ చేసిన కమలా హ్యారీస్.. వీడియో వైరల్

Kamala Harris

Updated On : September 11, 2023 / 9:18 PM IST

Kamala Harris Dances: అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారీస్ (58) తాజాగా వైట్ హౌస్ లో చేసిన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. వైట్ హౌస్ లో హిప్ హాప్స్ 50వ వార్షికోత్సవాన్ని ఆమె నిర్వహించారు.

ఇందులో కమలా హ్యారీస్ డ్యాన్స్ చేస్తుండగా తీసిన వీడియోను పొలిటికల్ కామెంటేటర్ ఆంథోనీ బ్రియాన్ లోగాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. హిప్ హాప్ ట్యూన్స్ కు తగ్గట్టు కమలా హ్యారీస్ డ్యాన్స్ చేయడం ఇందులో చూడొచ్చు. ఆమె డ్యాన్స్ పై చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. బామ్మలా డ్యాన్స్ చేశారని కొందరు అంటున్నారు.

ఆమె డ్యాన్సును చూడలేకపోతున్నామంటూ కొందరు విమర్శలు గుప్పించారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా కమలా హ్యారీస్ 2021, జనవరి 20 నుంచి కొనసాగుతున్నారు. అవసరమైతే తాను అమెరికా అధ్యక్షురాలిగా సేవలు అందించడానికి సిద్ధమని ఇటీవలే ప్రకటన చేశారు.

Khalid Latif : పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌ కు భారీ షాక్ ఇచ్చిన డచ్ కోర్టు