Drunk Drivers Cars Send To Ukraine : మద్యం తాగి వాహనం నడిపితే..ఆ వాహానాన్ని యుక్రెయిన్‌కు పంపిన్న అధికారులు
మద్యం తాగి వాహనం నడిపితే పోలీసులు జరిమానా విధిస్తారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. కానీ ఇప్పుడలా కాదు తాగి వాహనం నడిపితే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుని యుక్రెయిన్ ను తరలిస్తున్నారు అధికారులు.

Drunk Drivers Cars Send To Ukraine
Drunk Drivers Cars Send To Ukraine : మద్యం తాగి వాహనం నడిపితే పోలీసులు జరిమానా విధిస్తారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. కానీ ఇప్పుడలా కాదు తాగి వాహనం నడిపితే ఆ వాహనాన్ని ఏకంగా యుద్ధభూమి యుక్రెయిన్ ను తరలిస్తున్నారు అధికారులు. ఏంటీ కంగారుపడుతున్నారా?మన భారత్ లో కాదు లెండీ..యూరప్ దేశం లాత్వియాలో. అలా అక్కడ తాగి నడిపితే వారి వాహనాలకు స్వాధీనం చేసుకున్న అధికారులు ఆ వాహనాన్ని యుక్రెయిన్ సైనికులకు అందజేస్తున్నారు. ఇదో వింత శిక్ష అంటున్నారు లాత్వియా అధికారులు. అలా ఇప్పటి వరకూ సుమారు 1,200కు పైగా వాహానాలకు యుక్రెయిన్ కు తరలించారు లాత్వియా అధికారులు. ఆ వాహనాలను యుక్రెయిన్ సైన్యం తమ అవసరాలకు ఉపయోగించుకుంటోందని తెలిపారు.
ఉత్తర ఐరోపాలోని బాల్టిక్ సముద్ర తీరంలో ఉన్న లాత్వియా అధికారులు డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన వారికి వినూత్న రీతిలో శిక్ష విధిస్తు..ఒకసారి కంటే ఎక్కువగా తాగి పట్టుబడితే ఇక వారి వాహనాన్ని యుక్రెయిన్ కు తరలిస్తున్నారు. అలా ఇప్పటి వరకూ సుమారు 1,200కు పైగా కార్లను యుక్రెయిన్ సైన్యానికి అందజేసామని లాత్వియా అధికారులు వెల్లడించారు. లాత్వియా అధికారులు వేస్తున్న ఈ వినూత్న శిక్షలకు మందుబాబులు కాస్త దారికి వస్తున్నారట.
ఒకసారి కంటే ఎక్కువగా మద్యం తాగి పట్టబడితే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపుతున్నారు. కానీ రెండోసారి దొరికారా? ఇక అంతే జరిమానా కడతాం మా కారు మాకు ఇవ్వండని బతిమాలినా లాత్వియా అధికారులు వినటంలేదు.ఇక మీ వాహానం యుక్రెయిన్ కే అని తేల్చి చెప్పేస్తూ సదరు వాహనాలను సీజ్ చేస్తున్నారు. అనంతం ఆ వాహనాలకు యుక్రెయిన్ సైన్యానికి అందజేస్తున్నారు.
లాత్వియాలో కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం..వాహనం నడిపేవారు రెండు నెలల వ్యవధిలో రక్తంలో ఆల్కహల్ పర్సెంటేజ్ 0.15 శాతం కన్నా ఎక్కువగా ఉండి పట్టుబడితే ఈ వినూత్న శిక్షలను అమలు చేస్తున్నారు అధికారులు. జైడాట్ ఎన్వీ అనే స్వచ్ఛంద సంస్థ సాయంతో యుక్రెయిన్ సీజ్ చేసిన వాహనాలను పంపిస్తున్నారు. యుక్రెయిన్ ఆర్మీ వారి వారి అవసరాలకు అనుగుణంగా వాటిని వినియోగించుకుంటోంది. కాగా రష్యా దాడుల్లో యుక్రెయిన్ సైన్యానికి చెందిన వేలాది వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అందమైన యుక్రెయిన్ మరుభూమిలా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా దాడుల్లో ధ్వంసమైన భవన శిథిలాలే కనిపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో యుక్రెయిన్ సైన్యానికి లాత్వియా అధికారులు పంపిస్తున్న వాహనాలు కాస్త ఉపయోగకరంగా ఉంటున్నాయి.