ఎక్కడ చూసినా విధ్వంసం.. అమెరికాకి ఏమైంది.. ఏ దిశగా పోతోంది!

  • Published By: srihari ,Published On : June 3, 2020 / 07:57 AM IST
ఎక్కడ చూసినా విధ్వంసం.. అమెరికాకి ఏమైంది.. ఏ దిశగా పోతోంది!

Updated On : June 3, 2020 / 7:57 AM IST

కరోనా వ్యాప్తితో అల్లాడిపోతున్న అమెరికాలో ఇప్పుడు ఎటు చూసినా విధ్వంసం.. ఎక్కడ చూసినా లూటీలు.. అసలు అమెరికాకు ఏమైంది? ఏ దిశగా పోతోంది? ప్రపంచ దేశాల్లో ఇదే మాట వినిపిస్తోంది. కరోనా భయంతో ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతుకీడుస్తున్న అమెరికా వాసుల్లో విధ్వంసం కలవరం కనిపిస్తోంది. అగ్రరాజ్యంగా ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఉన్న అమెరికా విధ్వంసం పెచ్చురిల్లుతోంది. రోజురోజుకీ పరిస్థితి ఆందోళనకార స్థాయికి చేరుకుంటోంది. పట్టపగలే లూటీలు చేసేస్తున్నారు. నిజంగానే అమెరికాకి అంతమయ్యే రోజులు వచ్చాయా అన్నంతగా
పరిస్థితులు దిగజారిపోతున్నాయ్. నిరసనకారులను నియంత్రించడానికి దేశాధ్యక్షుడు మెరుపు నిర్ణయం తీసుకున్నారు. నిరసనలు ఆపకపోతే మిలటరీని రంగంలోకి దింపుతానని చెప్పిన కొన్ని గంటల్లోనే అన్నంత పని చేశారు ట్రంప్. 

జార్జ్ ఫ్లాయిడ్ హత్యకి నిరసనగా వరసగా ఏడో రోజు కూడా ఆందోళనలు కొనసాగడంతో దేశంలోని ప్రధాన నగరాలు అట్టుడికిపోతున్నాయ్. ఆందోళనకారులు రెచ్చిపోతుండటంతో పోలీసులు కూడా నిస్సహాయంగా చూస్తుండి పోవాల్సి వస్తోంది. లాస్‌వేగాస్‌లోని ఓ అల్లరిమూక దాడిలో ఓ పోలీస్ అధికారి చనిపోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. సెయింట్ లూయీస్‌లో మరో నలుగురు పోలీసులపై ఆందోళనకారులు దాడి చేసారు న్యూయార్స్ సిటీలో ఓ వైపు కరోనా కారణంగా అల్లాడుతుండగా.. జార్జ్ ఫ్లాయిడ్ హత్యకి నిరసనగా ఆందోళనలు కొనసాగాయి. 

ఈ ఆందోళన ముసుగులో అన్ని చోట్లా అల్లరిమూకలు లూటీలకు పాల్పడుతున్నారు. ఆస్తుల ధ్వంసానికి దిగారు. వాషింగ్టన్‌ డీసీలో భారీగా పోలీసులు రంగంలోకి దిగినా.. ప్రయోజనం లేకపోయింది. ఫిలడెల్ఫియా, మినియాపులీస్‌లో మాత్రం ఆందోళనకారులు ఓ వైపు శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాయి. మరోవైపు అల్లరిమూకలు యధేచ్చగా విధ్వంసానికి పాల్పడుతున్నారు.

దీంతో దేశంలోని 50 నగరాల్లో అమెరికా ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. అమెరికాలో అల్లర్లు మరింత పెరిగిపోతున్నాయి. జార్జ్ ఫ్లాయిడ్ హత్యకి నిరసనగా వరసగా ఏడో రోజు కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బెల్లా హాడిడ్.. కారా డెలెవింగిన్ వంటి స్టార్లంతా సోషల్ మీడియాలో బ్లాక్‌డే పాటించారు. మొత్తం మూజ్యిక్ వరల్డ్ అంతా బ్లాకవుట్ పాటించింది.

Read: ట్రంప్ అన్నంత పనిచేశాడు.. మిలటరీని రంగంలోకి దింపేశాడు!