Los Angeles Robbery : అమెరికాలో పట్టపగలు లగ్జరీ వాహనాల్లో వచ్చిన షాపు మొత్తం దోచుకుపోయిన దుండగులు..
50మంది ముసుగులు వేసుకుని ఒకేసారి వచ్చి పడ్డారు. సిబ్బంది కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టారు. అంతే షాపు మొత్తం దోచుకుపోయారు. పట్టపగలు దోచుకుపోతున్నా ఏమీ చేయలేక నిస్సహాయంగా నిలబడిపోయారు.

California Los Angeles Robbery
Los Angeles Robbery : ఒకరు ఇద్దరు వచ్చి దోచుకుపోతే ఏమంటాం..దొంగలేమో అనుకుంటాం. కానీ 50మంది ఒకేసారి వచ్చి దోచుకుపోతే ఏమంటాం..లూటీ అంటాం. కానీ పట్టపగలు మిట్టమధ్యాహ్నం నాలుగు గంట సమయంలో బీఎంబ్ల్యూ, లెక్సస్ వంటి పలు లగ్జరీ వాహనాల్లో ముసుగులు ధరించి ఓ షాపుపై పడి అందిన కాడికి దోచుకుపోతే ఏమనాలి..? వారు దొంగలా..బందిపోట్లా..వారిని ఏమనాలో తెలియక బిత్తరపోయిన దోపిడీ ఘటన అమెరికా(America)లోని కాలిఫోర్నియా (California)రాష్ట్రంలోని లాజ్ ఏంజెల్స్ ( Los Angeles)లో చేసుకుంది.
ముసుగులు ధరించి 50 మంది దొంగలు ఒక దుకాణంలోకి హఠాత్తుగా దూసుకొచ్చారు. ఏదో పోటీ పెట్టినట్లుగా అందరూ తలోదిక్కుకు వెళ్లిపోయిన పక్కా ప్లాన్ వేసుకుని వచ్చినట్లుగా అందినకాడికి దోచుకుపోయారు. హ్యాండ్ బ్యాగులే కాదు ఏంది దొరికితే అది పట్టుకుని ఉడాయించారు. అంతమంది ఒకేసారి ముసుగులు వేసుకుని తమ కళ్లముందే దోచుకుపోతుంటే షాపు సిబ్బంది ఏమీ చేయలేక నిస్సహాయంగా నిలబడిపోయారు. లాస్ ఏంజెల్స్ లో కొద్దిరోజుల క్రితం జరిగిన ఆ ఘటన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. శనివారం (ఆగస్టు,2023)న జరిగిన ఈ మైండ్ బ్లాంక్ అయిన ఈ దోపిడీని సీసీ టీవీ ఫుటేజ్ లో చూసిన లాజ్‌ఏంజెల్స్ పోలీసు విభాగం (Los Angeles Police Department)సైతం షాక్ అయ్యింది.
Hiroshi Suzuki : రజనీ స్టైల్లో కళ్లద్దాలు తిప్పడానికి ట్రై చేసిన జపాన్ రాయబారి వీడియో వైరల్
టొపంగా మాల్‌లోని నార్డ్‌స్ట్రామ్ డిపార్ట్‌మెంట్ (Westfield Topanga Shopping Center)స్టోర్‌లోకి దాదాపు 50 మంది వ్యక్తులు ముసుగులు ధరించి దూసుకొచ్చారు. భద్రతా సిబ్బందిపై పెప్పర్ స్ప్రే కొట్టారు. అంతే వారు తేరుకునేలోగా పని కానిచ్చేసారు. షాపులోకి దూసుకెళ్లి చేతికందిన ఖరీదైన బ్యాగులు, దుస్తులు దోచుకున్నారు. ఆ ఫ్లాష్ మాబ్ అంతే వేగంగా అక్కడి నుంచి జారుకుంది. దోపిడీదారులు హింసాత్మకంగా వ్యవహరించారని..వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. వారు దోచుకున్న వస్తువుల విలువ లక్ష డాలర్ల వరకు ఉంటుందని వెల్లడించారు.
అనూహ్యంగా అంతమంది ఒకేసారి రావటంతో సిబ్బంది బిత్తరపోయారు. వారిని అడ్డుకోవటానికి యత్నంచారు. కానీ పెప్పర్ స్ప్రే కొట్టటంతో ఏమీ చేయలేకపోయారు.నిస్సహాయులగా ఉండిపోయారు. వారు తేరుకునేలోగా దుండగులు అందినకాడికి దోచుకుపోయారు. దుండగులు బీఎంబ్ల్యూ(BMW), లెక్సస్ (Lexus)వంటి పలు ఖరీదైన వాహనాల్లో దోపిడీకి వచ్చారని పోలీసులు తెలిపారు.
Um grupo de pelo menos 30 pessoas assaltou uma loja de luxo Nordstrom no WestField Topanga Shopping Center em Los Angeles, Califórnia, resultando num prejuízo estimado de quase 100 mil dólares. pic.twitter.com/jHXT6MMToN
— Mundo Vivo (@mundo__vivo) August 14, 2023