ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్ ఎప్పుడు వస్తున్నారో తెలుసా?
నాసా, స్పేస్ ఎక్స్ కలిసి వీరిద్దరిని భూమి మీదకు అనుకున్న తేదీ కంటే ముందుగానే తీసుకురానున్నాయి.

Sunita Williams
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కొన్ని నెలలుగా అక్కడే ఉంటున్నారు. వారిద్దరిని భూమి మీదకు తీసుకు రావాలని నాసా చాలా కాలంగా ప్రయత్నాలు జరుపుతోంది.
వారిద్దరిని ఇప్పుడు నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే భూమి మీదకు తిరిగి తీసుకురావాలని భావిస్తోంది. ఈ ఏడాది మార్చి రెండో వారంలో వారిని తీసుకురానున్నారు. షెడ్యూల్ ప్రకారం వారిద్దరు వచ్చే నెల చివరి వారం లేదంటే ఏప్రిల్ తొలి వారంలో రావాల్సి ఉంది.
అంతకు ముందుగానే వారికి తీసుకురావాలని ఇప్పుడు నాసా ప్రణాళికలు వేసుకుంది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ను తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ చేపట్టిన క్రూ-9 మిషన్‌ను ఇప్పటికే ఐఎస్‌ఎస్‌కు పంపారు.
Bird flu: ఆ ఒక్క ప్రాంతంలో 4 లక్షలకు పైగా కోళ్లు మృతి.. తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన చికెన్ ధరలు
వారిద్దరు క్రూ-9 మిషన్ ద్వారానే తిరిగి భూమి మీదకు వస్తారు. క్రూ-9 సిబ్బందిని రిలీవ్ చేయడానికి వెళ్లే క్రూ-10 ప్రయోగం మార్చి 12నే జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో సునీ, విల్‌మోర్ ఇద్దరూ ఏప్రిల్ తొలివారంలో కాకుండా మార్చి రెండో వారంలోనే భూమి మీదకు వచ్చే అవకాశం ఉంది.
క్రూ-10 మిషన్ లాంచ్‌ను నాసా మార్చి 12న చేపట్టాలని భావిస్తోంది. ఈ మిషన్ ద్వారా నలుగురు సిబ్బందిని నాసా పంపనుంది. నాసా వ్యోమగాములు అన్నే మెక్‌క్లైన్, నికోల్ అయర్స్, జాక్సా వ్యోమగామి తకుయా ఒనిషి, రోస్కోస్మోస్ కాస్మోనాట్ కిరిల్ పెస్కోవ్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తారు. దీంతో క్రూ -9 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్, విల్మోర్, నిక్ హేగ్, రోస్కోస్మోస్ కాస్మోనాట్ అలెక్సాండర్ గోర్బునోవ్ భూమి మీదకు వస్తారు.