కరాళ నృత్యం : 1490కి చేరిన కరోనా మృతులు 

  • Published By: veegamteam ,Published On : February 14, 2020 / 05:16 AM IST
కరాళ నృత్యం : 1490కి చేరిన కరోనా మృతులు 

Updated On : February 14, 2020 / 5:16 AM IST

కరోనా (కోవిద్ 19) వైరస్ సోకి మృతి చెందేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ కరోనా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఈ క్రమంలో  ప్రపంచ వ్యాప్తంగా 1490కి మృతుల సంఖ్య పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా 28 దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 65 వేల 247 కేసులు నమోదయ్యాయి. 
బుధవారం (ఫిబ్రవరి 13,2020)ఒక్కరోజే చైనాలో కరోనో సోకినవారు 242మంది మృతి చెందారు. దీంతో బుధవరాం నాటికి  దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 1,368కి చేరింది.

కోవిడ్-19 వైరస్ కరాళానృత్యం రోజు రోజుకు తీవ్రస్థాయికి చేరుకుంటోంది.  చైనాలో అయితే దాని తీవ్రత ఎంతగా ఉందో ఊహించటానికే వణుకు వచ్చేస్తోంది. మృతులు, బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వైరస్ రాకెట్ స్పీడ్ వేగంతో వ్యాపిస్తోంది. చైనాలోకి ఒక్క హుబే ప్రావిన్స్ లోనే.. ఒక్కసారిగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరిగింది. తాజా లెక్కల ప్రకారం 50వేల మందికి కరోనా సోకింది. మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఒకే రోజు 14వేల 840 కరోనా కేసులు నమోదు కావటం దాని స్థాయి ఎంతగా ఉందో తెలుస్తోంది. దీంతో చైనా వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బైటకు రావాలంటేనే హడలిపోతున్నారు. 

భారత్ పాటు మరో 20 దేశాలకు కరోనా వైరస్ విస్తరిస్తోంది. కరోనా వైరస్ కారణంగా చైనాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు ఇళ్లల్లో బందీలుగా మారారు. గడపదాటి బయటకు వచ్చే సాహసం కూడా చేయలేకపోతున్నారు. 

 
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం:
ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా పలు రంగాల్లో కార్యకలాపాలు స్థంభించిపోయాయి. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. అత్యంత త్వరగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉండడంతో చైనాలో విద్యాసంస్థలతో పాటు ఆఫీసులు సెలవులు ప్రకటించాయి. దీనికితోడు చైనాకు సమీపంలోని దేశాలపైనా కరోనా ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. పరిశ్రమలతో పాటు పర్యాటక రంగం ఇప్పటికే నెమ్మదించింది. ఆయా దేశాలు చైనాకు వెళ్లిన పర్యాటకులను తమ దేశాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నాయి.

Click Here>>డేంజర్ బెల్స్.. ఒక్కసారిగా 50వేల మందికి కరోనా వైరస్