రష్యా కరోనా వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్…14 శాతం మంది వాలంటీర్లకి అనారోగ్య సమస్యలు

ప్రపంచంలోనే కరోనాకు తొలి వ్యాక్సిన్ ను తయారు చేసింది తామేనని గత నెల 11న ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి నివారణ కోసం తాము అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్-వి’ వ్యాక్సిన్‌ను ఓవైపు తుది దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతుండగానే.. మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు రష్యా ఆరోగ్య శాఖ గతవారం వెల్లడించిన విషయం తెలిసిందే. గమలేయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ మైక్రాలజీ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి’ అన్ని రకాల క్వాలిటీ టెస్ట్‌లలో పాసైందని, అందుకే మొదటి బ్యాచ్ ను మార్కెట్‌లోకి విడుదల చేశామని రష్యా ఆరోగ్యశాఖ ప్రకటించింది.
అయితే, స్పుత్నిక్-వి’ వ్యాక్సిన్ తో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తినట్లు తాజాగా రష్యా ఆరోగ్యశాఖ మరో ప్రకటన చేసింది. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న 300 మంది వాలంటీర్లలో 14 శాతం మంది వివిధ కారణాలతో అనారోగ్యానికి గురయ్యారని రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురష్కో మంగళవారం తెలిపారు. ‘‘ట్రయల్స్ లో భాగంగా 300 మందికిపైగా వాలంటీర్లకు టీకాలు వేశాం. అందులో 14 శాతం మంది రకరకాల ఇబ్బందులకు లోనయ్యారు. కొందరికి అలసట, ఇంకొందరికి కండరాల నొప్పులు కలగ్గా, మరికొందరిలో శరీర ఉష్ణోగ్రత పెరిగిందన్నారు.
https://10tv.in/there-wont-be-enough-covid-19-vaccines-till-2024/
సేఫ్టీఫై అనుమానాలు వద్దు..
క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొని, వ్యాక్సిన్ డోసు వల్ల అస్వస్థతకు గురైన వాలంటీర్లను ఆయా సెంటర్లలోనే ఉంచి చికిత్స అందిస్తున్నామని, నిజానికి వారికి తలెత్తినవి చిన్న సమస్యలేనని, వ్యాక్సిన్ మాన్యువల్ లోనూ ఇలా జరగొచ్చని రాసుందని, కాబట్టి స్పుత్నిక్-వి సేఫ్టీపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ స్పష్టం చేశారు.