India Pakistan Tensions: మళ్లీ రెచ్చిపోయిన పాకిస్తాన్.. వరుసగా రెండోరోజు దాడికి యత్నం, డ్రోన్లను కూల్చేసిన భారత ఆర్మీ
ఎల్ వోసీ వెంబడి వార్ సైరన్ ను మోగించింది ఇండియన్ ఆర్మీ.

India Pakistan Tensions: పాకిస్తాన్ మళ్లీ రెచ్చిపోయింది. వరుసగా రెండోరోజు భారత్ పై దాడికి యత్నించింది. జమ్ము, సాంబా, పఠాన్ కోట్, నౌగాంలో డ్రోన్లతో దాడికి పాక్ ప్రయత్నం చేసింది. పూంచ్, ఫిరోజ్ పూర్, అమృత్ సర్, జైసల్మేర్ లో డ్రోన్లతో అటాక్ చేసేందుకు పాక్ ట్రై చేసింది. పాక్ డ్రోన్లను భారత సైన్యం కూల్చేసింది. జైసల్మేర్ లోని పోఖ్రాన్ దగ్గర పాక్ డ్రోన్ ని కూల్చేసింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో పాక్ డ్రోన్లను భారత్ నిర్వీర్యం చేసింది.
జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ లక్ష్యంగా పాక్ సైన్యం దాడులు చేస్తోంది. పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఎల్ వోసీ వెంబడి వార్ సైరన్ ను మోగించింది ఇండియన్ ఆర్మీ.
Also Read: దటీజ్ ఇండియా.. ఆపరేషన్ సిందూర్‌తో గీత దాటకుండానే పాకిస్తాన్‌ని చావుదెబ్బ కొట్టిన భారత్..
జమ్ముకశ్మీర్, సాంబా, యురి, జైసల్మేర్ లో బ్లాకౌట్ ప్రకటించారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. హరియానాలోని అంబాలా, పంచకులలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లోనూ విద్యుత్ సరఫరా ఆపేశారు. జమ్ముకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ బోర్డర్ లో హైఅలర్ట్ ప్రకటించారు.