Pakistan Bans Holi : యూనివర్శిటీలో హోలీని బ్యాన్ చేసిన పాకిస్థాన్

పాకిస్థాన్ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్శిటీల్లోనే హోలీ వేడులను నిషేధిస్తున్నట్లుగా ప్రకటించింది.

Pakistan Bans Holi : యూనివర్శిటీలో హోలీని బ్యాన్ చేసిన పాకిస్థాన్

Pakistan bans Holi

Updated On : June 21, 2023 / 5:39 PM IST

Pakistan bans Holi in universities : పాకిస్థాన్ (Pakistan) ఉన్నత విద్యా కమిషన్ (Higher Education Commission)హోలీ (Holi)వేడుకలను నిషేధించింది. యూనివర్శిటీల్లో (universities )హోలీ వేడులను (Holi celebrations)నిషేధించింది(bans). దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్శిటీల్లోనే హోలీ వేడులను నిషేధిస్తున్నట్లుగా ప్రకటించింది. ఖైద్ -ఈ- ఆజామ్ యూనివ‌ర్సిటీ ( Quaid-i-Azam University)లో విద్యార్థులు హోలీ రంగుల‌తో ఎంజాయ్ ( celebrated Holi)చేసిన తరువాత పాక్ విద్యా మండ‌లి (Higher Education Commission)నిర్ణ‌యం తీసుకున్న‌ది.

వర్శిటీలో జూన్ 12న జ‌రిగిన హోలీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. యూనివర్సిటీకి చెందిన రాజకీయేతర సాంస్కృతిక సంస్థ మెహ్రాన్ స్టూడెంట్స్ కౌన్సిల్ (Mehran Students’ Council)నిర్వహించిన ఈ ఈవెంట్ పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.  హోలీ ఆడుతూ చిందులు వేస్తున్న విద్యార్ధుల వీడియోల‌ను యూనివ‌ర్సిటీ అఫీషియ‌ల్ పేజీలో పోస్టు చేశారు. దీంతో ఆ వేడుక‌పై దుమారం చెల‌రేగింది. దీంతో పాక్ విద్యా కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇటువంటి కార్యకలాపాలు ఇస్లామిక్ గుర్తింపును క్షీణింపజేస్తాయని నోటీసులో పేర్కొంది. వివిధ రకాల మత విశ్వాసాలు, ఆచారాలతో కూడిన వైవిధ్యత ఇతర మతాలను గౌరవించే సమాజాన్ని సృష్టిస్తుందని..ఈ రకమైన సమాజాన్ని అందర కోరుకుంటారు. ఈ వాస్తవాన్ని మేం గౌరవిస్తున్నాం. కానీ పాకిస్థాన్ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నామని పేర్కొంది.