Viral Video: వామ్మో.. ప్రోగ్రామ్‌కి వచ్చిన చీఫ్ గెస్ట్‌పై ల్యాండ్ అయిన పారాగ్లైడర్
మైదానంలో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా అదుపుతప్పి ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చాడు.

ప్రోగ్రామ్‌కి వచ్చిన చీఫ్ గెస్ట్‌పైనే ల్యాండ్ అయ్యాడు ఓ పారాగ్లైడర్. పాకిస్థాన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈవెంట్‌లో పారాగ్లైడర్ తన ప్రతిభను కనబర్చుతున్నాడు. గాలిలో పారాచూట్ సాయంతో రెడ్, బ్లూ పొగను వదులుతూ విన్యాసాలు చేశాడు.
మైదానంలో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా అదుపుతప్పి ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చాడు. దీంతో వేదికపై ఉన్న వారంతా భయపడిపోయారు. వేదికపై మొదటి రోలో కూర్చున్న వారిపై ల్యాండ్ అయ్యాడు. అక్కడ కూర్చున్న వారిలో కొందరు దూరంగా పరిగెత్తి తప్పించుకోగలిగారు. పరిగెత్తలేనివారు అక్కడే ఉండిపోయారు.
చీఫ్ గెస్ట్‌పైనే ఆ పారాగ్లైడర్ ల్యాండ్ అయ్యాడు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. కొన్ని వారాల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. పాకిస్థాన్ పారాగ్లైడర్లతోనూ కాస్త జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Bud Landed over Chief Guest in Pakistan😭
pic.twitter.com/1y9kjDiOzg— Ghar Ke Kalesh (@gharkekalesh) December 2, 2024
Ponnam Prabhakar: ప్రతిపక్ష రాజకీయ కుట్రలు తిప్పికొట్టాలి: పొన్నం ప్రభాకర్