Ponnam Prabhakar: ప్రతిపక్ష రాజకీయ కుట్రలు తిప్పికొట్టాలి: పొన్నం ప్రభాకర్
రాబోయే కాలంలో ప్రజల ఆకాంక్షలను మరింత ముందుకు తీసుకెళ్లేలా పాలనను అందిస్తామని పొన్నం ప్రభాకర్ అన్నారు.

Minister Ponnam Prabhakar
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 2023 డిసెంబర్ 3న తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజలు గత సంవత్సర కాలంగా ఏ విధంగా ఆశీర్వదించారో భవిష్యత్ కాలంలో కూడా ప్రతిపక్ష రాజకీయ కుట్రలు తిప్పికొట్టి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి బలోపేతం చేయాలని కోరారు.
రాబోయే కాలంలో ప్రజల ఆకాంక్షలను మరింత ముందుకు తీసుకెళ్లేలా పాలనను అందిస్తామని పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులుగా మెజారిటీ విజయం సాధించామని తెలిపారు. సంవత్సర కాలంగా పరిపాలనకు సహకరించిన ప్రజలందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు.
ముఖ్యంగా ఉద్యమకారుడిగా విద్యార్థి నాయకుడిగా తెలంగాణ సాధనలో తన బాధ్యతను చూసి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి తనను శాసన సభ్యుడుగా గెలిపించిన హుస్నాబాద్ ప్రజలకు ధన్యవాదాలని పొన్నం ప్రభాకర్ తెలిపారు. తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సంవత్సర కాలంలో రైతులు, మహిళా సంక్షేమ కార్యక్రమాలు, విద్యా, వైద్య ఇతర రంగాల్లో సంస్కరణలు చేశామని చెప్పారు. భవిష్యత్తులో 4 సంవత్సరాల కాలంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్య విలువలతో ప్రజాస్వామ్య రక్షణకై కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటుందని అన్నారు.
Eknath Shinde: మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండేకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు