Pakistan : షకీరా ‘వాకా వాకా”సాంగ్‌ని ఈ మామిడి పండ్ల వ్యాపారి ఎలా మార్చి పాడుతున్నాడో చూడండి
ఎంత చిన్న వ్యాపారమైన ప్రమోషన్ లేకపోతే లాభం రాదు. అందుకోసం రకరకాల ఫీట్లు చేయాల్సిందే. మామిడి పండ్లను అమ్మే ఓ వీధి వ్యాపారి కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు షకీరా పాట 'వాకా వాకా' సాహిత్యాన్ని తన బిజినెస్‌కి అనుకూలంగా మార్చుకుని పాడుతున్నాడు. ఇంటర్నెట్‌లో ఈ వ్యాపారి వీడియో వైరల్ అవుతోంది.

Pakistan
Pakistan : పాప్ స్టార్ షకీరా సాంగ్ ‘వాకా వాకా’ పాట ఎంత ఫేమస్ అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటకి కొన్ని ట్విస్ట్‌లు ఇస్తూ పాకిస్తాన్‌లో ఓ వీధి వ్యాపారి మామిడి పండ్లు అమ్ముతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
world Most Expensive Mangoes : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు..కిలో 2.70 లక్షలు..
వీధి వ్యాపారులు కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి రకరకాల ఐడియాలు ఫాలో అవుతుంటారు.. వాళ్లు అమ్మే వస్తువుల సంగతి ఎలా ఉన్నా వారి టాలెంట్‌కి పడిపోయి కస్టమర్లు దుకాణాలపై ఎగబడతారు. పాకిస్తాన్‌లోని అటాక్ నగరంలో ఓ మామిడి పండ్ల వ్యాపారి గమ్మత్తుగా వ్యాపారం చేస్తున్నాడు. షకీరా పాట ‘వాకా వాకా’ పాట ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలిసిందే. ఈ పాటకు ట్విస్ట్‌లు ఇస్తూ తన వ్యాపారానికి అనుకూలంగా మార్చుకుని ఈ స్ట్రీట్ సెల్లర్ మామిడిపండ్లు అమ్ముతున్నాడు.
Mangoes on EMI : EMIలో మామిడిపండ్లు అందిస్తున్న పూనే వ్యాపారి.. ఆసక్తి చూపిస్తున్న కొనుగోలుదారులు
hamzachoudharyofficial అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియో పోస్ట్ చేశారు. ‘అటాక్ నగరంలో వారికి మాత్రమే ఇలాంటి టాలెంట్ ఉంటుంది’ అనే శీర్షికను కూడా యాడ్ చేశారు. ఇక మామిడి పండ్ల వ్యాపారి ‘వాకా వాకా’ పాటకు ఇంటర్నెట్‌లో చాలామంది స్పందించారు. ‘షకీరా ఇన్ మల్టీవర్స్’ అని ఒకరు.. ‘అది టాలెంట్ కాదు.. కాన్ఫిడెన్స్’ అని మరొకరు స్పందించారు. ఈరోజుల్లో ఎంత క్రియేటివ్‌గా బిజినెస్‌ను ప్రమోట్ చేసుకుంటే అంత లాభం అనేది ఇలాంటి వ్యాపారస్తుల్ని చూసి నేర్చుకోవాలని చాలామంది అభిప్రాయపడ్డారు.
View this post on Instagram