PM Modi US Visit Begin Today: ప్రధాని మోదీ అమెరికా పర్యటన నేడు ప్రారంభం

PM Modi US Visit Begin Today: ప్రధాని మోదీ అమెరికా పర్యటన నేడు ప్రారంభం

ప్రధాని మోదీ అమెరికా పర్యటన నేడు ప్రారంభం

Updated On : June 20, 2023 / 7:37 AM IST

PM Modi US Visit Begin Today: ఐదు రోజుల అమెరికా దేశ పర్యటన కోసం మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు. ప్రధాని మోదీ జూన్ 21వతేదీన భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1.30 గంటలకు వాషింగ్టన్‌లోని ఆండ్రూస్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో దిగాల్సి ఉంది. అక్కడ భారతీయ అమెరికన్ బృందం ప్రధానికి స్వాగతం పలకనుంది.(Prime Minister Narendra Modi)

Rajasthan Cyclone Biparjoy: అతి భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదలు, ఏడుగురి మృతి

అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ తీరికలేని సమావేశాలతో బిజీగా ఉంటారు. భారతీయ అమెరికన్ల సీఈవోలతో కూడా ప్రధాని సమావేశం కానున్నారు. ఆ తర్వాత బుధవారం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన నాయకత్వం వహిస్తారు.యోగా కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ వాషింగ్టన్ డీసీకి బయలుదేరుతారు. వాషింగ్టన్ డీసీలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ మోదీ గౌరవార్థం ప్రైవేట్ విందు ఏర్పాటు చేశారు.

Married Woman Live In Relation: భర్త అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని భార్య ఏం చేసిందంటే…షాకింగ్

అమెరికా కాంగ్రెస్ సభ్యులతో సహా అన్ని వర్గాల ప్రజలు తన పర్యటన గురించి ఉత్సాహం చూపిస్తున్నారని ప్రధాని సోమవారం పేర్కొన్నారు.(Modi tweet) అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి చెందిన ట్విట్టర్ ఖాతాను మోదీ ట్యాగ్ చేశారు. అందులో యూఎస్ కాంగ్రెస్ సభ్యులు, వ్యాపారవేత్తలు, భారతీయ-అమెరికన్లు ,ఇతరులతో సహా పలువురు వ్యక్తులు అమెరికా దేశ పర్యటన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మోదీకి స్వాగతం పలికిన వీడియోలు ఉన్నాయి.

Daku Haseena:డాకు హసీనా కేసులో దిమ్మతిరిగిపోయే వాస్తవాలు

ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు భారతీయ-అమెరికన్లు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి రికీ కేజ్, గాయని మేరీ మిల్‌బెన్ హాజరుకానున్నారు.జూన్ 21 నుంచి ప్రారంభమయ్యే అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో విస్తృత చర్చలు జరుపుతారు. రెండవసారి యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు.