పుల్వామా ఎఫెక్ట్: దెబ్బకు సౌదీ రాజే వెనక్కి తగ్గాడు

పుల్వామా ఎఫెక్ట్: దెబ్బకు సౌదీ రాజే వెనక్కి తగ్గాడు

పుల్వామా ఘటన భారత్‌లోనే కాదు. సౌదీలోనూ అలజడి రేపింది. సౌదీ రాజు పాక్‌కు రావాల్సిన రెండు రోజుల పర్యటన ఉగ్రదాడి కారణంగా వాయిదా పడింది. దీంతో ఫిబ్రవరి 17న పాక్‌కు రానున్నట్లు  పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సౌదీ రాకుమారుడు మొహమ్మద్ బిన్ సల్మాన్ శనివారమే ఇస్లామాబాద్ చేరుకోవాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నట్లు ప్రభుత్వాధికారులు చెప్పుకొస్తున్నారు. 

రాజుతో పాటుగా రాజ కుటుంబీకులు, మంత్రలు, వ్యాపారవేత్తలు భారీగా పాక్‌కు చేరుకోనున్నారు. 2017 తర్వాత చాన్నాళ్లకు చేస్తున్న పర్యటన కావడంతో భారీ భద్రతను ఏర్పాటుచేశారు. జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎఫ్ సైనికులు చనిపోవడమే పర్యటన వాయిదా వేయడానికి కారణమని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. 

ఘటన జరిగిన తర్వాత భారత్ త్వరగా కోలుకునేందుకు అన్ని రకాలుగా సాయం చేస్తామని సౌదీ ప్రభుత్వం మాటిచ్చింది. అదే విధంగా గత నెల సౌదీ అరేబియా ప్రభుత్వం 3బిలియన్ల అమెరికన్ డాలర్లు ఇచ్చి పాకిస్తాన్ ఆర్థిక శాఖకు సాయం చేసింది. పాక్ పర్యటన అనంతరం సౌదీ రాజు భారత్‌లోనూ ఫిబ్రవరి 19నుంచి పర్యటించనున్నారు.