అమెరికాను కదిలించిన పుల్వామా దాడి : దారుణం అన్న ట్రంప్
పుల్వామా ఉగ్రదాడి అమెరికాను కదిలించింది. భారతదేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన అంటూ వ్యాఖ్యానించారు ప్రెసిడెంట్ ట్రంప్. పుల్వామా దాడి దారుణం అని అన్నారు.

పుల్వామా ఉగ్రదాడి అమెరికాను కదిలించింది. భారతదేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన అంటూ వ్యాఖ్యానించారు ప్రెసిడెంట్ ట్రంప్. పుల్వామా దాడి దారుణం అని అన్నారు.
పుల్వామా ఉగ్రదాడి అమెరికాను కదిలించింది. భారతదేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన అంటూ వ్యాఖ్యానించారు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. పుల్వామా దాడిని తీవ్రంగా ఖండించిన ట్రంప్.. టెర్రర్ అటాక్ ను భయానక చర్యగా అభివర్ణించారు. ఉగ్రదాడికి సంబంధించి పూర్తి నివేదికలు పరిశీలించామన్న ట్రంప్.. టెర్రర్ అటాక్ కు కారణమైన పాకిస్తాన్ ను శిక్షించాల్సిందే అన్నారు. తీవ్రవాదానికి మద్దతు పలికే చర్యలు మానుకోవాలని పాక్ కు హితవు పలికారు.
టెర్రర్ అటాక్ కు పాల్పడిన వారిని శిక్షించాలని పాక్ ను ట్రంప్ డిమాండ్ చేశారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నామని, పరిస్థితులు తీవ్ర స్థాయిలో ఉన్నాయని ట్రంప్ అన్నారు. సరైన సమయంలో టెర్రరిజంపై స్పందిస్తామన్నారు. ఉగ్రవాద చర్యలను ప్రేరేపించే దిశగా పాక్ వ్యవహరిచకూడదన్నారు. రెండు దేశాలు శాంతియుతంగా కలిసి ముందుకెళ్లాలని, ఉగ్రవాదం నిర్మూలన విషయంలో భారత్-పాకిస్తాన్ కలిసి పని చేయాలని ట్రంప్ పిలుపునిచ్చారు.
ముష్కర మూకలపై పాకిస్తాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారత్ చేస్తున్న వాదనను అమెరికా సెక్యూరిటీ అడ్వైజర్ జాన్ బాల్టన్ సమర్థించారు. భారత్ కు మద్దతుగా నిలిచారు. జేషే మహమ్మద్ టెర్రరిస్టులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎట్టిపరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిందే అని తేల్చి చెప్పారు. ఉగ్రవాదుల విషయంలో ఉపేక్షిస్తే పాకిస్తాన్ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఫిబ్రవరి 14వ తేదీన జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్తున్న సీఆర్పీఎఫ్ బలగాల కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. దాడి తమపనే అంటూ కాసేపటికే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ వీడియోలను విడుదల చేసింది. ఆత్మాహుతి దాడికి కశ్మీర్ కు చెందిన యువకుడినే ఉగ్రవాదుల ఎంచుకున్నారు. అతడిలో భారత్ పై విద్వేషం నూరిపోసి సూసైడ్ బాంబర్ గా తయారు చేశారు. పుల్వామా దాడి వెనుక పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని ఆధారాలు ఉన్నా.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం.. తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తున్నారు. ఆధారాలు ఉంటే చూపించండి చర్యలు తీసుకుంటామని కబుర్లు చెబుతున్నారు. అంతేకాదు భారత్ యుద్ధానికి వస్తే ధీటుగా ఎదుర్కొంటామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.