Huge Light To Earth : భూగ్రహంపైకి 10 కోట్ల కోట్ల సూర్యుళ్ల కాంతి.. బ్లాక్ హోల్ గుట్టు విప్పిన పరిశోధకులు
భూమివైపుకు భారీ కాంతిని వెదజల్లుతున్న ఓ బ్లాక్ హోల్ గుట్టును పరిశోధకులు విప్పారు. భూగ్రహంపైకి 10 కోట్ల కోట్ల సూర్యుళ్లు వెదజల్లే కాంతిని పంపిస్తున్న కృష్ణ బిలాన్ని గుర్తించారు. అమెరికా కాలిఫోర్నియాలోని జ్వికీ ట్రాన్సియల్ ఫెసిలిటీ సాయంతో కనుగొన్నారు.

black hole light
Huge Light To Earth : అంతరిక్షంలో అనేక వింతలు, విశేషాలు జరుగుతుంటాయి. భూమివైపుకు భారీ కాంతిని వెదజల్లుతున్న ఓ బ్లాక్ హోల్ గుట్టును పరిశోధకులు విప్పారు. భూగ్రహంపైకి 10 కోట్ల కోట్ల సూర్యుళ్లు వెదజల్లే కాంతిని పంపిస్తున్న కృష్ణ బిలాన్ని గుర్తించారు. అమెరికా కాలిఫోర్నియాలోని జ్వికీ ట్రాన్సియల్ ఫెసిలిటీ సాయంతో కనుగొన్నారు.
Black Hole Near Earth : భూమికి సమీపంగా బ్లాక్‌హోల్.. సూర్యుడి కంటే 10 రెట్లు పెద్దది
ఈ కృష్ణబిలానికి ఏటీ 2022 సీఎంసీగా నామకరణం చేశారు. ఇది భూమి నుంచి 850 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మొత్తం 21 టెలిస్కోప్ లను ఉపయోగించి బ్లాక్ హోల్ నుంచి అలల అంతరాయ సంఘటన అనే దృగ్విషయం వల్ల భారీ కాంతి వెదలజల్లుతున్నట్లు కనుగొన్నారు.