పుట్టగొడుగులు తింటూ..18 రోజులు గడిపిన పొలిటికల్ లీడర్

పుట్టగొడుగులు తింటూ..18 రోజులు గడిపిన పొలిటికల్ లీడర్

Updated On : January 25, 2021 / 10:12 AM IST

Robert Weber missing : ఇంటికి ఎలా వెళ్లాలో తెలియదు..ఆకలికి తట్టుకోలేకపోయాడు. ఏం చే్యాలో తెలియడం లేదు. అడవిలో ఉన్న పుట్టగొడుగులు తింటూ..నీళ్లు తాగుతూ…గడిపేశాడు. ఇలా ఒక రోజు కాదు..రెండు రోజులు కాదు..ఏకంగా 18 రోజులు గడిపాడు. చివరకు ఇతడిని పోలీసులు గుర్తించడంతో క్షేమంగా బయటపడ్డాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. అక్కడ రాజకీయ నేత మిస్సింగ్ కథ సుఖాంతం అయ్యింది.

రాబర్ట్ వెబర్..స్థానిక రాజకీయ నేత. కిల్కివాన్ అనే పట్టణంలో ఓ హోటల్ లో బస చేశాడు. తన కుక్కను తీసకుని కారులో బయటకు వచ్చాడు. ఓ ప్రదేశంలో బురదలో కారు ఇరుక్కపోయింది. ఎంత ప్రయత్నించినా..కారు బయటకు రాలేదు. కారులోనే మూడు రోజులు గడిపాడు. ఇతను కనిపించకపోవడం కలకలం రేపింది. ఇక..ఇంటికి వెళ్లడానికని..కారును అక్కడనే వదిలేసి అడవిలో బయలుదేరాడు. దారి తెలియలేదు.

పయనం డ్యామ్ లో నీళ్లు..అడవిలో ఉన్న పుట్టగొడుగులే అతనికి ఆహారమయ్యాయి. వాటితోనే ప్రాణాలు కాపాడుకున్నాడు. రాబర్ట్ వెబర్ మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు గాలింపులు తీవ్రతరం చేశారు. కానీ ఫలితం కనిపించలేదు. ఇటీవలే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి..డ్యామ్ వద్దనున్న వెబర్ ను గుర్తించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతని మిస్సింగ్ కథ సుఖాంతం అయ్యింది. కానీ..అతని కుక్క మాత్రం ఇంకా దొరకలేదని పోలీసులు వెల్లడించారు.