Russia – Ukraine War: రష్యా చెబుతుందొకటి.. చేసేది మరొకటి
రష్యా చెబుతున్నది ఒకటి.. చేస్తున్న నిర్వాకం మరోకటి..! కేవలం యుక్రెయిన్ ఆర్మీనే టార్గెట్ చేశామని బయటకు ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్న రష్యా..

Russia At War
Russia – Ukraine War: రష్యా చెబుతున్నది ఒకటి.. చేస్తున్న నిర్వాకం మరోకటి..! కేవలం యుక్రెయిన్ ఆర్మీనే టార్గెట్ చేశామని బయటకు ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్న రష్యా.. యుక్రెయిన్ పౌరులను కూడా టార్గెట్ చేస్తున్నదని స్పష్టంగా తెలుస్తోంది.
యుక్రెయిన్‌లోని చెర్నీహివ్ మిస్సైల్ దాడులతో అట్టుడుకుతోంది. చెర్నీహివ్ టార్గెట్‌గా మిస్సైల్ దాడులు చేస్తోన్న రష్యా.. సామాన్యులపై మిస్సైల్ వర్షం కురిపిస్తోంది. చెర్నీహివ్‌లోని అపార్ట్‌మెంట్‌లపై దాడి చేసింది. అపార్ట్‌మెంట్‌లలోని ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. రెండు ఫ్లోర్‌లు మంటల్లో చిక్కుకున్నాయి.
యుక్రెయిన్ -రష్యా మధ్య యుద్ధం ఐదో రోజుకు చేరింది. ఐదో రోజూ యుక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి.
చర్చలంటూ చెబుతూనే భీకర దాడులకు తెగబడుతోంది. యుక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు ఖార్కివ్ నగరాల్లో మరోసారి పేలుళ్లు సంభవించాయి. రష్యా దాడులను యుక్రెయిన్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది.
మరోవైపు పుతిన్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు యూరోపియన్ యూనియన్ రష్యాపై ఆంక్షల

Ukraine Cry
మరోవైపు రష్యా న్యూక్లియర్ దాడులకు సిద్ధపడడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇవాళ పలు దేశాల నేతలతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ సమావేశం కానున్నారు.
150 రష్యా ట్యాంకర్లను ధ్వంసం చేశామని యుక్రెయిన్ ప్రకటించింది. 26 రష్యా చాపర్లను కూల్చివేసినట్లు తెలిపింది. 4 వేల 500 మంది రష్యా సైనికులను హతమార్చినట్లు ప్రకటించింది.
యుక్రెయిన్‌లో రెండవ అతిపెద్ద నగరం ఖర్కీవ్‌లో రెండు దేశాల సేనల మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. రష్యా దాడుల్లో 352 మంది యుక్రెయిన్ సైనికులు, పౌరులు మృతి చెందినట్లు సమాచారం. 16వందల 84 మంది గాయపడినట్లు యుక్రెయిన్ వెల్లడించింది.
దక్షిణ యుక్రెయిన్‌లో కీలకమైన ప్రాంతాలన్నిటిని రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నాయి. విమానాశ్రయాలు మీద దృష్టిపెట్టిన రష్యా సేనలు దాడులు ముమ్మరం చేశాయి. అటు కీవ్ పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భూగర్భ గ్యారేజీల్లోనూ, సబ్‌వేల్లోనూ బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు.